Site icon NTV Telugu

TTD : ఏప్రిల్ 5 నుంచి రామయ్య వార్షిక బ్రహ్మోత్సవాలు

Ttd 1

Ttd 1

TTD : తిరుమలలోని ఒంటిమిట్ట ఏకశిలానగరంలో జగదభి రామయ్య బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం అవుతోంది. ఏప్రిల్ 5వ తేదీ నుంచి రామయ్య వార్షిక బ్రహ్మోత్సవాలు జరగబోతున్నాయని టీటీడీ డిప్యూటీ ఈవో నటేష్ బాబు ప్రకటించారు.. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు గ్రాండ్ గా నిర్వహిస్తున్నామన్నారు. కోదండ రామయ్య బ్రహ్మోత్సవాల ముందు, కోయిల్ ఆల్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ వస్తోందని.. దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా చేస్తున్నామన్నారు. ఉదయం 8 గంటల నుండి 11 గంటల వరకు కోయిల్ ఆల్వార్ కార్యక్రమం ఉంటందన్నారు.

Read Also : Zelenskyy: ఆస్తులు ప్రకటించిన ఉక్రెయిన్ అధ్యక్షుడు.. ఎంత పెరిగిందంటే..!

ఈ కార్యక్రమాలను ఆద్యంతం భక్తి పరావశ్యంతో నిర్వహించబోతున్నామన్నారు. ఈ క్రతువు జరిగే సమయంలో గర్భాలయంలోకి భక్తుల ప్రవేశం నిలిపివేస్తామన్నారు. ఉదయం 11.20 గంటల నుండి రామయ్య దర్శనం కోసం భక్తులకు అనుమతి ఇస్తామని ఆ సమయంలోనే భక్తులు దర్శనం చేసుకోవాలని సూచించారు. భక్తులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని వివరించారు. భక్తులు కూడా ఒకేసారి దర్శించుకోవాలనే ఆలోచనను పెట్టుకోవద్దని.. ప్రతిరోజూ దర్శనాలు ఉంటాయని తెలిపారు. కాబట్టి టైమ్ రూల్స్ ను తెలుసుకుని రావాలన్నారు.

Exit mobile version