NTV Telugu Site icon

RAM Trailer: ఏంట్రా ఒక్కదానికేనా.. రేపు పెళ్లయ్యాక ఏం చేస్తావ్! ఆకట్టుకుంటున్న రామ్‌ ట్రైలర్

Ram Movie Trailer

Ram Movie Trailer

Rapid Action Mission (RAM) Movie Trailer Out: దేశభక్తిని చాటి చెప్పే చిత్రంగా రామ్‌ (ర్యాపిడ్ యాక్షన్ మిషన్) రాబోతోంది. దీపిక ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై ఓఎస్‌ఎం విజన్‌తో కలిసి ప్రొడక్షన్‌ నెం.1గా ఈ సినిమాను రూపొందించారు. మిహిరామ్ వైనతేయ దర్శకుడిగా అరంగేట్రం చేస్తున్నారు. ఆయనే ఈ మూవీకి కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించారు. దీపికాంజలి వడ్లమాని నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమాతో సూర్య అయ్యలసోమయజుల హీరోగా పరిచయం అవుతున్నారు. ధన్యా బాలకృష్ణ హీరోయిన్‌గా నటించారు.

ఇప్పటికే రామ్‌ చిత్రం నుంచి విడుదల చేసిన పోస్టర్లు, పాటలు అందరినీ ఆకట్టుకున్నాయి. రీసెంట్‌గా రాహుల్ సిప్లిగంజ్ పాడిన దేశ భక్తి గీతం, మనతోని కాదురా భై అనే రొమాంటిక్ పాటలు అందరినీ ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్‌ను విడుదల చేశారు. సైంధవ్ డైరెక్టర్ శైలేష్ కొలను విడుదల చేసిన ఈ ట్రైలర్ అందరినీ ఆకట్టుకుంటోంది. ‘జీవితం అనేది ఒక యుద్దం.. చుట్టూ మనుషులు ఉన్నా లేకపోయినా.. నీ పోరాటం నువ్వే చేయాలి. ఆ పోరాటంలో నా రామ్ గెలుస్తాడని నాకు నమ్మకం ఉంది.. గెలుస్తావ్ కదా?’ అంటూ తండ్రి చెప్పే మాటలతో ట్రైలర్ ఓపెన్ అయింది. సినిమాలో దేశ భక్తిని చాటే ఎన్నో డైలాగ్స్ ఉన్నాయి. కళ్ళలో త్రివర్ణ పతాకాన్ని చూపించే షాట్ గూస్ బంప్స్ తెప్పిస్తుంది.

Also Read: IND vs AFG: బౌలింగ్‌ కంటే.. ఫీల్డింగ్‌ చేయడం అంటేనే వణుకు పుడుతోంది!

‘ఏంట్రా ఒక్కదానికేనా.. రేపు పెళ్లయ్యాక ఏం చేస్తావ్’ అని హీరోయిన్ చెప్పే డబుల్ మీనింగ్ డైలాగ్ అందరినీ ఆకట్టుకుంటోంది. కమర్షియల్, యాక్షన్, పేట్రియాటిక్ జానర్లో రాబోతోన్న రామ్‌ చిత్రంలో భాను చందర్, సాయి కుమార్, రోహిత్, శుభలేఖ సుధాకర్, రవివర్మ, మీనా వాసు, అమిత్ కుమార్ తివారీ, భాషా తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి ఆశ్రిత్ అయ్యంగార్ సంగీతం అందిస్తుండగా.. ధారన్ సుక్రి సినిమాటోగ్రఫీ వర్క్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను జరుపుకుంటోంది. త్వరలో విడుదలకు సిద్దంగా ఉంది.

Show comments