Site icon NTV Telugu

Ram Mandir Ceremony: బాలరాముడి ప్రతిష్ట.. కేంద్రం కీలక నిర్ణయం

Ram Manidr

Ram Manidr

అయోధ్యలోని శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ట సందర్భంగా కేంద్రం కీలక ప్రకటన చేసింది. ఈ నెల 22న దేశవ్యాప్తంగా అన్ని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలకు హాఫ్ హాలీడే ప్రకటిస్తున్నట్లు కేంద్ర మంత్రిత్వ శాఖ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. శ్రీరామ మందిరంలోని గర్భగుడిలో రామ్‌లాలా కొత్త విగ్రహం ‘ప్రాణ్‌ప్రతిష్ఠ’ కార్యక్రమం సోమవారం జరగనుంది. ఈ వేడుకను ప్రధాని నరేంద్ర మోదీ నిర్వహించనున్నారు.

Student Suicide: ఐఐటీ కాన్పూర్‌లో పీహెచ్‌డీ విద్యార్థి ఆత్మహత్య.. నెల రోజుల్లో 3వ ఘటన

కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే అన్ని కార్యాలయాలన్నింటికి ఈ హాఫ్ హాలీడే వర్తించనున్నట్లు కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ వెల్లడించారు. మరోవైపు.. దేశవ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలలకు ఉదయం నుంచి మధ్యాహ్నం 2:30 గంటల వరకు హాఫ్ హాలీడే ఇచ్చే అవకాశం ఉంది. అయోధ్యలో జరిగే రాంలల్లా విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని ప్రజలు ప్రత్యక్ష ప్రసారంలో చూసేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నారు.

YCP Fourth List: నాలుగవ జాబితాపై కొనసాగుతున్న కసరత్తు.. అభ్యర్థుల్లో వీడని ఉత్కంఠ

ఇదిలా ఉంటే.. ఈనెల 22ప ప్రధాని మోదీ రామాలయాన్ని ప్రారంభించి, రాంలల్లాను ప్రతిష్ఠాపన చేసిన తర్వాత జనవరి 23 నుంచి ఆలయాన్ని భక్తుల కోసం తెరుస్తామని తెలిపారు. కాగా.. విగ్రహ ప్రతిష్టాపన రోజు తమ ఇళ్లలో దీపాలు వెలిగించాలని, దీపావళి వంటి పండుగలను జరుపుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండా జనవరి 22 తర్వాత పార్లమెంటు నియోజకవర్గాల వారి ప్రజలను రైళ్లలో అయోధ్యకు పంపించాలని చెప్పారు.

Exit mobile version