NTV Telugu Site icon

Jamili Elections: నేడు జమిలి ఎన్నికలపై మాజీ రాష్ట్రపతి నివేదిక..

Kovind

Kovind

Ram Nath Kovind: మరి కొద్ది రోజుల్లో భారత్లో ఏకకాలంలో లోక్‌సభ, అసెంబ్లీ, మున్సిపాలిటీ, గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు గల సాధ్యాసాధ్యాల పరిశీలనకు మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ నేతృత్వంలో ఏర్పాటైన కమిటీ ఇవాళ (గురువారం) నివేదికను సమర్పించే అవకాశం ఉంది. ఒకే దేశం- ఒకే ఎన్నిక నినాదంతో జమిలి ఎన్నికల నిర్వహణ మన దేశంలో ఎంత వరకు సాధ్యం, ఇతర అంశాలపై వివిధ వర్గాల నుంచి సమాచారం, అభిప్రాయాలను సేకరించిన కోవింద్‌ కమిటీ నేడు రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసి రిపోర్టును సమర్పిస్తారని అధికార వర్గాలు వెల్లడించాయి.

Read Also: IRCTC: ఇకపై గంటలోపే మీ అకౌంట్లోకి రిఫండ్స్‌ డబ్బులు..!

కాగా, జమిలి ఎన్నికలకు రాజ్యాంగంలోని ఆఖరి ఐదు అధికరణలను సవరించాలని మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కమిటీ సూచించినట్టు తెలుస్తుంది. అంతే కాకుండా పార్లమెంట్‌, అసెంబ్లీ ఎన్నికలకు ఒకే ఓటరు లిస్టు ఉంచే విషయంపై కూడా కమిటీ దృష్టి సారించినట్లు తెలుస్తుంది. ఇక, ఇప్పటికే దేశంలోని పలు అధికార, విపక్ష పార్టీల నుంచి, లా కమిషన్‌, ఇతర ముఖ్య సంస్థల నుంచి ఈ కమిటీ అభిప్రాయాలను తీసుకుంది.

Show comments