Indigo Crisis: పౌర విమానయాన మంత్రి రామ్ మోహన్ నాయుడు లోక్ సభలో విమాన ఛార్జీలపై ఒక ముఖ్యమైన ప్రకటన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం ఏడాది పొడవునా విమాన ఛార్జీలను పరిమితం చేయలేదని అన్నారు. పండుగ సీజన్‌లో డిమాండ్ పెరుగుతుందని, అందుకు అనుగుణంగా ఛార్జీలు పెరుగుతాయని అన్నారు. రద్దీగా ఉండే పండుగ సీజన్‌లో విమానయాన సంస్థలు తమ సామర్థ్యాన్ని పెంచుకోవాలని కోరుతున్నట్లు తెలిపారు. అవసరమైనప్పుడు కేంద్రం ఛార్జీలను పరిమితం చేస్తుందన్నారు. మహా కుంభమేళా, పుల్వామా దాడి, ఇండిగో సంక్షోభం సమయంలో ధరలను నియంత్రించడానికి కేంద్రానికి ఉన్న అధికారాలను ఉపయోగించినట్లు పేర్కొన్నారు.
READ ALSO: James Anderson: 43 ఏళ్ల వయసులో కెప్టెన్‌గా.. జేమ్స్ అండర్సన్ సంచలనం..!
ఫేర్ టు లీజర్ పథకం కింద దేశవ్యాప్తంగా 25 రూట్లలో విమాన ఛార్జీలు నిర్ణయిస్తారని, వాటిని పెంచలేమని కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడు పేర్కొన్నారు. లోక్ సభలో షఫీ పరంబ్‌బిల్ అనే ఒక ప్రైవేట్ మెంబర్ ప్రవేశపెట్టిన బిల్లుపై కేంద్ర మంత్రి ఈ విధంగా స్పందించారు. ఈ బిల్లు విమాన ఛార్జీలను నియంత్రించడానికి ప్రయత్నించింది. అయితే చర్చ అనంతరం షఫీ పరంబ్‌బిల్ దీనిని ఉపసంహరించుకున్నారు.
రాజ్యసభలో జీరో అవర్ సమయంలో సభ్యులు ఇండిగో సంక్షోభం అంశాన్ని లేవనెత్తారు. ఈ సందర్భంగా ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ విక్రమ్‌జిత్ సింగ్ సాహ్ని మాట్లాడుతూ.. “65 శాతం విమాన రాకపోకలను రెండు విమానయాన సంస్థలు నిర్వహిస్తున్నాయి. ఆరోపణలు చేయకుండా, ఇది అందరి బాధ్యతగా మనం చూడాలి. బ్యాంకులు, విద్యుత్ ప్లాంట్లు మొదలైనవి NPAలు లేదా NCLTలను ఎదుర్కొన్నప్పుడు, ప్రభుత్వం వాటిని పునర్నిర్మిస్తుంది, కానీ విమానయాన సంస్థల విషయంలో ఇది జరగలేదు. విమానయాన సంస్థకు ఏవైనా సమస్యలు ఉన్నా, ప్రజా భద్రత విషయంలో రాజీ పడకూడదు” అని ఆయన పేర్కొన్నారు.
READ ALSO: Sashivadane: అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతున్న ‘శశివదనే’..
