NTV Telugu Site icon

RGV : భారీ బడ్జెట్ తో రామ్ గోపాల్ వర్మ పాన్ ఇండియా సినిమా.. హీరో ఎవరంటే ?

Rgv

Rgv

RGV : రామ్ గోపాల్ వర్మ ఉరప్ ఆర్జీవీ ఈ పేరుతో ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. వివాదం లేనిదే వ‌ర్మ లేడు అన్నట్లు ఉంటాయి ఆయన వ్యాఖ్యలు. ఆయ‌న వ్యాఖ్య‌లు నిత్యం మీడియాలో వైరల్ అవుతుంటాయి. కొంత కాలంగా ఆయ‌న సినిమాల‌కు దూరంగా ఉంటూ వివిధ ఇంట‌ర్వ్యూల‌తో ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా ఓ ఛానెల్ ఇంట‌ర్వ్యూలో త్వరలో భారీ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. దీంతో ఇప్పుడీ ప్రకటన పై అందరు ఆసక్తి చూపిస్తున్నారు. రెండేళ్ల గ్యాప్ అనంత‌రం వ‌ర్మ గ‌తేడాది ‘వ్యూహం’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. అదీ మార్చిలో రిలీజ్ అయింది. ఆ త‌ర్వాత మ‌ళ్లీ కొత్త సినిమా అప్ డేట్ ఇంత వరకు లేదు. సామాన్యంగా ఓ సినిమా సెట్ మీద ఉండగానే రెండు మూడు సినిమాలను ప్రకటిస్తారు వర్మ. అలా వివిధ ప్రాజెక్ట్ లు చేస్తున్నట్లు ప్రకటించార కానీ వాటిని ప‌ట్టాలెక్కించ‌లేదు. వాటి స్టోరీలు ఎంత వ‌ర‌కూ వ‌చ్చాయి? అన్నది కూడా అప్ డేట్ ఇవ్వలేదు. ఈ నేప‌థ్యంలో తాజాగా భారీ సినిమా చేస్తానంటూ ముందుకు రావడం క్యూరియాసిటీని పెంచింది.

Read Also:Police Constable: కుటుంబ గొడవల కారణంగా పోలీస్ కానిస్టేబుల్ ఆత్మహత్య

ప్రస్తుతం టాలీవుడ్ దర్శకులంతా పాన్ ఇండియా సినిమాలు తీస్తు్న్న సంగ‌తి తెలిసిందే. 1000 కోట్లు..1500 కోట్లు అంటూ ఇండియాలో రికార్డులు క్రియేట్ చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో వ‌ర్మ నోటి నుంచి భారీ సినిమా ప్రకటన రావడం నిజంగా అభిమానులకు గుడ్ న్యూస్ అనే చెప్పాలి. మ‌రి ఆ సినిమా క‌థ ఏంటి? అన్నది త్వరలోనే బయ‌ట‌కు వ‌చ్చే అవ‌కాశం ఉంది. తప్పుకుండా టాలీవుడ్ స్టార్ హీరోనే ఈ సినిమాలో నటిస్తాడని కూడా వార్తలు వస్తున్నాయి. దర్శకుడిగా వర్మ శివ సినిమాలా మరోసారి ఇండియాని షేక్ చేసే సినిమాలు ఎప్పుడు తీస్తారా అని ఆయన అభిమానులు వెయిట్ చేస్తున్నారు. మ‌రి భారీ సినిమా ప్రకటన వెనుక ఆయ‌న వ్యూహం ఏంటి?అన్నది తెలియాలి. న్యూ ఇయర్ సందర్భంగా వర్శ షాకింగుగా ఏడు డెసిషన్లు తీసుకున్నట్లు సోషల్ మీడియాలో ప్రకటించిన సంగతి తెలిసిందే.

Read Also:Bhopal Gas Tragedy: భోపాల్ గ్యాస్ ప్రమాదం జరిగిన 40 ఏళ్లకు కీలక నిర్ణయం..

Show comments