RGV Reviews: ధురంధర్-2’పై రామ్‌గోపాల్ వర్మ క్రేజీ రివ్యూ.. హాలీవుడ్ దిగ్గజ డైరెక్టర్లకు కీలక సలహా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
RGV Reviews Dhurandhar 2 after early watch: తెలుగు, హిందీ చిత్ర పరిశ్రమలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (RGV) తాజాగా ‘ధురందర్: ది రివెంజ్’ రివ్యూ చెప్పారు. ఈ సినిమా భారీ విజయం సాధిస్తుందని అంచనా వేస్తూ తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. మంగళవారం రాత్రి ఆ సినిమాను చూసినట్లు వెల్లడించారు. దాని సినిమాటిక్ వ్యాకరణాన్ని ప్రశంసిస్తూ.. “కొత్త సినిమా శకానికి నాంది” (New Cinematic Order) అని అభివర్ణించారు. రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో ఆదిత్య ధర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంపై వర్మ భారీ అంచనాలు ఉన్న విషయం తెలిసిందే. ఈ సినిమా ధాటికి ‘షోలే’, ‘మొఘల్-ఎ-ఆజం’ వంటి ఆల్‌టైమ్ క్లాసిక్ సినిమాలు టీవీ సీరియల్స్‌లా కనిపిస్తాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ సినిమాల కంటే వంద రెట్లు ఎక్కువ ప్రభావం ఈ చిత్రం చూపుతుందని, బాక్సాఫీస్ కలెక్షన్లు, ఆడియన్స్ క్రేజ్ విషయంలో సరికొత్త రికార్డులు సృష్టిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. దర్శకుడు ఆదిత్య ధర్‌ను ఆకాశానికెత్తేస్తూ.. ఇకపై ‘డైరెక్టర్’ అనే పదానికి స్పెల్లింగ్ ఆయన పేరుతోనే మొదలవుతుందని వర్మ కొనియాడారు. హాలీవుడ్ దిగ్గజాలైన స్టీవెన్ స్పీల్‌బర్గ్, క్రిస్టోఫర్ నోలన్ వంటి డైరెక్టర్లు తాము చేస్తున్న పనులన్నీ వదిలేసి ధురంధర్-2 సినిమా చూడాలని సూచించారు.
READ MORE: Ganja Smuggling: గంజాయి కేటుగాళ్లుగా కానిస్టేబుల్స్.. విశాఖలో ఐదుగురు అరెస్ట్!
Also Read
- Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
- Third Front: దేశంలో ‘‘థర్డ్ ఫ్రంట్’’.. కనిమొళి వరస భేటీలతో కొత్త చర్చ..
- Marital Rape: వైవాహిక అత్యాచారంపై సుప్రీంకోర్టు కీలక విచారణ.. తెగే పంచాయితీనేనా?
- Pakistan: అరేబియా సముద్రంలో భారత్-పాక్ నేవీ ఢీ.. చైనా వ్యూహాలపై అనుమానం.!
“నిన్న రాత్రి #Dhurandhar2 ను చూశాను. అన్ని కోణాల్లో సినిమా అద్భుతంగా ఉంది. ఆశించిన వసూళ్లు సాధిస్తుంది. ప్రేక్షకుల పరవశం, సామాజిక ప్రభావం, సినిమాటిక్ గ్రామర్‌ను బద్దలు కొట్టడం లేదా అన్నింటికీ మించి ఆ సినిమా సైకలాజికల్ ఆడియో విజువల్ ఇంపాక్ట్ ప్రభావం చూపుతుంది.. ఇది ఖచ్చితంగా ‘షోలే’ కంటే 100 రెట్లు ఎక్కువ ఘనత సాధిస్తుంది. మొఘల్-ఎ-ఆజమ్ నుంచి మొదలుకొని ఇప్పటివరకు వచ్చిన గొప్ప చిత్రాలన్నింటి సరసన చేరడం ఖాయం. ఇక మొఘల్-ఎ-అజం వంటి గొప్ప క్లాసిక్ చిత్రాలన్నీ ‘ధురంధర్ 2’ ముందు కేవలం టీవీ సీరియల్స్ లా కనిపిస్తాయి. ఇది సరికొత్త సినిమాటిక్ ఆర్డర్‌కు పునాది. గతంలో ఉన్న సినిమా ప్రపంచాన్ని ఈ చిత్రం కనుమరుగు చేస్తుంది. ఇకపై ‘డైరెక్టర్’ (DIRECTOR) అనే పదానికి స్పెల్లింగ్ ఆదిత్య ధర్ (@adityadharfilms) పేరుతోనే మొదలవుతుంది. చివరికి స్టీవెన్ స్పీల్‌బర్గ్, క్రిస్టోఫర్ నోలన్ సైతం తాము చేస్తున్న పనులన్నీ పక్కన పెట్టి మరీ #Dhurandhar2 ఫస్ట్ డే ఫస్ట్ షో చూడటం వారికి ఎంతో వివేకవంతమైన పని అవుతుంది.” అని ట్వీట్‌లో రామ్‌గోపాల్ వర్మ పేర్కొన్నారు.
READ MORE: Taurus Horoscope: ఖర్చులు అదుపులో ఉంచుకోవాల్సిందే.. వృషభ రాశి వారికి కొత్త ఏడాది ఎలా ఉండబోతుందంటే..!
తాజావార్తలు
-
OTR : అనకాపల్లి జిల్లాలో సీఎం రమేష్ వర్సెస్ గుడివాడ అమర్నాథ్
-
Story Board : డీలిమిటేషన్ పై కేంద్రం వ్యూహమేంటి..? తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది..?
-
CM Revanth Reddy :హైదరాబాద్‌లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
-
Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్‌న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
-
Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!