NTV Telugu Site icon

RGV : తమిళ హీరోతో ఆర్జీవి.. కొత్త సినిమా ప్లాన్ చేస్తున్నారా?

Rgv

Rgv

ఒకప్పుడు స్టార్ హీరోలతో వరుస సినిమాలు చేసిన వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. ఇప్పుడు వివాస్పద సినిమాలకు కేరాఫ్ గా మారారన్న సంగతి తెలిసిందే..తనకు నచ్చిన సినిమాలు తీసుకుంటూ టైం పాస్ చేస్తూ, తన సినిమాలు, తన ట్వీట్స్ తో సోషల్ మీడియాలో ఎప్పుడూ ట్రెండింగ్ లో ఉంటాడు.. రీసేంట్ గా తమిళ హీరోను కలిసినట్లు తెలుస్తుంది. అందుకు సంబందించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..

ఈ మధ్య సినీ స్టార్స్ ను ఆర్జీవి కలవలేదు.. పార్టీలు, డ్యాన్స్లు చేస్తూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్నారు.. రాజకీయాల్లో కూడా అప్పుడప్పుడు వేలు పెడుతాడు.. కానీ ఇప్పుడు సడెన్ గా తమిళ హీరోను కలవడం పై గుసగుసలు వినిపిస్తున్నాయి.. చెన్నైలో తమిళ్ స్టార్ నటుడు విజయ్ సేతుపతిని తన ఆఫీస్ లోనే కలిశాడట రామ్ గోపాల్ వర్మ. విజయ్ సేతుపతితో ఆర్జీవీ మాట్లాడుతుండగా తీసిన ఫోటోని తన సోషల్ మీడియాలో షేర్ చేశాడు..

అంతేకాదు విజయ్ సినిమాల్లో కన్నా, బయటే బాగున్నాడు అంటూ ఆ ఫొటో కింద రాసుకొచ్చాడు.. దీంతో ఆర్జీవీ పోస్ట్ వైరల్ గా మారింది. అసలు ఎలాంటి పని లేకుండా ఎవర్ని కలవని ఆర్జీవీ చెన్నై వెళ్లి మరీ విజయ్ సేతుపతిని తన ఆఫీస్ లోనే కలిసాడంటే ఏదో గట్టి ప్లాన్ చేస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. విజయ్ సేతుపతితో కొత్త సినిమా ప్లాన్ చేస్తున్నాడా? లేక ఏదైన ఈవెంట్ కోసం వెళ్లాడా అనేది మాత్రం తెలియలేదు కానీ ఈ ఫోటో మాత్రం నెట్టింట ట్రెండ్ అవుతుంది..

Show comments