Site icon NTV Telugu

Lenin : పెద్ది రాకతో అయ్యగారి ‘లెనిన్’ సినిమా పోస్ట్ పోన్

Peddi vs lenin

Peddi

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం పెద్దివిడుదల తేదీ ఖరారైంది. మొదట మార్చి 27న విడుదల కావాల్సిన ఈ చిత్రం, ఇప్పుడు సమ్మర్ కానుకగా ఏప్రిల్ 30, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. ఈ మేరకు దర్శకుడు బుచ్చిబాబు సానా అధికారికంగా ప్రకటన విడుదల చేశారు. అయితే, ఈ ప్రకటన అక్కినేని యువ హీరో అఖిల్ సినిమాపై ప్రభావం చూపేలా కనిపిస్తోంది.

Also Read : Premalu 2 : బ్లాక్ బస్టర్ సీక్వెల్ ప్రేమలు – 2ను రద్దు చేసిన మేకర్స్..

అఖిల్ అక్కినేని నటిస్తున్న మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘లెనిన్’ సమ్మర్ కానుకగా ఈ ఏడాది మే 1న విడుదల కానున్నట్లు ప్రకటించారు. అక్కినేని ఫ్యామిలీకి మే నెల సెంటిమెంట్‌గా ఉండటంతో ఆ డేట్‌ను లాక్ చేశారు. అయితే, ఇప్పుడు అంతకు ఒక్క రోజు ముందే అంటే ఏప్రిల్ 30న రామ్ చరణ్ ‘పెద్ది’ బాక్సాఫీస్ బరిలోకి దిగుతుంది. ఇలాంటి సిచుయేషలో లెనిన్ వచ్చే పరిస్థితి లేదు. అఖిల్ తన సినిమా కోసం కొత్త విడుదల తేదీని వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. రామ్ చరణ్ పక్కా మాస్ లుక్‌లో కనిపిస్తున్న ‘పెద్ది’పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఏఆర్ రెహమాన్ సంగీతంలో వచ్చిన ‘చికిరి చికిరి’ సాంగ్ చార్ట్ బస్టర్‌గా నిలిచింది. ఇంతటి భారీ సినిమా విడుదలైన మరుసటి రోజే ‘లెనిన్’ను రిలీజ్ చేయడం రిస్క్ అని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. దీనివల్ల థియేటర్ల కేటాయింపులో కూడా సమస్యలు వచ్చే అవకాశం ఉంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ మరియు అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మిస్తున్న ‘లెనిన్’ చిత్రం అఖిల్‌కు అత్యంత కీలకం. అందుకే ‘పెద్ది’ లాంటి భారీ ప్రాజెక్టుతో పోటీ పడకుండా, సేఫ్ డేట్ కోసం మేకర్స్ ఆలోచిస్తున్నట్లు సమాచారం. త్వరలోనే ‘లెనిన్’ కొత్త విడుదల తేదీపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

Exit mobile version