NTV Telugu Site icon

Game Changer Teaser: ‘గేమ్ ఛేంజర్‌’ టీజర్ డేట్ ఫిక్స్.. ఈవెంట్ మన దగ్గర మాత్రం కాదు!

Game Changer Teaser

Game Changer Teaser

మెగా పవర్ స్టార్ రామ్‌ చరణ్, ఎస్ శంకర్‌ల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమా ‘గేమ్ ఛేంజర్‌’. ఈ సినిమా అప్‌డేట్స్‌ కోసం మెగా అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. దసరా, దీపావళికి టీజర్‌ విడుదల అవుతుందని వార్తలు వచ్చినా.. అది జరగలేదు. తాజాగా గేమ్ ఛేంజర్‌ టీజర్ డేట్ లాక్ అయింది. నవంబర్ 9న టీజర్ లాంచ్ ఈవెంట్ లక్నోలో జరగనుంది.

గేమ్ ఛేంజర్‌ టీజర్ లాంచ్ ఈవెంట్‌కు రామ్‌ చరణ్, ఎస్ శంకర్‌ సహా టీమ్ మొత్తం హాజరవనుంది. లాంచ్ ఈవెంట్‌ భారీ ఎత్తున ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు మూవీ రానుండగా.. రెండు నెలల ముందే టీజర్‌ను రిలీజ్ చేయడానికి మూవీ టీమ్ సిద్ధమైంది. ఇప్పటికే విడుదలైన పాటలు సినిమాపై అంచనాలు పెంచాయి. ఇక టీజర్ కోసం ఫాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

గేమ్ ఛేంజర్‌ మూవీ పొలిటికల్‌, యాక్షన్‌ నేపథ్యంలో సాగే పవర్‌ఫుల్‌ కథాంశంతో తెరకెక్కుతోంది. ఇందులో రామ్ చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఇప్పటికే చరణ్ షూటింగ్ పూర్తయింది. బాలీవుడ్ భామ కియారా అడ్వాణీ హీరోయిన్‌. అంజలి, శ్రీకాంత్‌, సునీల్‌, ఎస్‌జె సూర్య, సముద్రఖని, నవీన్‌ చంద్ర తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌ రాజు నిర్మిస్తున్నారు.

Show comments