Site icon NTV Telugu

Peddi: “పెద్ది” నుంచి బిగ్‌అప్డెట్.. తొలి పాట రిలీజ్ డేట్ ఇదే..!

Peddi

Peddi

Ram Charan’s ‘Peddi’ Movie First Song: రామ్‌చరణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘పెద్ది’ మూవీ చిత్రీకరణ శరవేగంగా కొనసాగుతోంది. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో, నిర్మాత వెంకట సతీశ్ కిలారు.. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో రూపొందుతున్న ఈ మూవీ వచ్చే ఏడాది మార్చి 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రముఖ నటీనటులు కన్నడ స్టార్ శివరాజ్‌కుమార్, జగపతిబాబు, దివ్యేంద్ర శర్మ తదితరులు కీలక పాత్రల్ని పోషిస్తున్నారు. ఈ సినిమాపై తాజాగా బిగ్‌ అప్డెట్ వచ్చింది..

READ MORE: Woman Alleges Mother: అసలు నువ్వు తల్లివేనా.. కన్నకూతరినే వ్యభిచారంలోకి..

ఈ కొత్త పాట కోసం సంగీత దర్శకుడు ఏఆర్‌ రెహమాన్ అద్భుతమైన గీతాన్ని సిద్ధం చేశారు. ఈ నెల 8న రామోజీ ఫిల్మ్‌ సిటీలో జరగనున్న ఏఆర్‌ రెహమాన్‌ లైవ్‌ కాన్సెర్ట్‌లోనే మొదటి పాటను వినిపిచేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సమాచారాన్ని డైరెక్టర్ బుచ్చిబాబు సోషల్ మీడియాల వేదికగా సంకేతాలు ఇచ్చేశారు. ఈ పాటకు జానీ మాస్టార్ కోరిగ్రాఫి చేస్తుండగా, భారీ విజువల్స్‌తో ప్రేక్షకులకు మ్యూజిక్ మ్యాజిక్ అందించేలా దర్శక, సాంకేతిక బృందం సన్నాహాలు చేస్తున్నారు. అంచనాల ప్రకారం అనుకున్న సమయానికి షూటింగ్ పూర్తి చేయలనే లక్ష్యం పెట్టుకున్నట్లు క్లియర్‌గా తెలుస్తోంది. ఆర్‌.రత్నవేలు ఛాయాగ్రహణ బాధ్యతలను నిర్వహిస్తున్నారు.

READ MORE: Omar Abdullah vs Lt Governor: జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర హోదాపై ఎల్జీ-ముఖ్యమంత్రి మధ్య రగడ

Exit mobile version