NTV Telugu Site icon

Game Changer : ‘గేమ్ చేంజ‌ర్‌’ బ్లాక్‌బ‌స్ట‌ర్ స‌క్సెస్‌ను ఫ్యాన్స్‌తో క‌లిసి జ‌రుపుకున్న రామ్ చ‌ర‌ణ్‌

Gamechanger

Gamechanger

Game Changer : ఓ వైపు మెగాభిమానులు.. మ‌రో వైపు సినీ ప్రేక్ష‌కులు ఇస్తోన్న ఆద‌ర‌ణతో ‘గేమ్ చేంజ‌ర్‌’ బాక్సాఫీస్ ద‌గ్గ‌ర సంద‌డి చేస్తూ దూసుకెళ్తోంది. గ్లోబ‌ల్‌స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరోగా స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ తెర‌కెక్కించిన ఈ భారీ పాన్ ఇండియా మూవీ సంక్రాంతి సంద‌ర్భంగా తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో రిలీజై సెన్సేష‌న‌ల్ బ్లాక్ బ‌స్ట‌ర్ విజ‌యాన్ని సాధించింది. తొలిరోజున వ‌ర‌ల్డ్ వైడ్‌గా రూ.186 కోట్లు క‌లెక్ష‌న్స్ వ‌చ్చాయి. సంక్రాంతి పండుగ సీజ‌న్ కావ‌టంతో రెండో రోజున కూడా వ‌సూళ్ల ప‌రంగా ఇటు సౌత్‌లోనూ.. అటు నార్త్‌లోనూ అదే స్పీడుని గేమ్ చేంజ‌ర్ కొన‌సాగిస్తుండ‌టం విశేషం.

Read Also:Andhra Pradesh: ఆర్ధిక శాఖకు సంబంధించి ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..

ప్రజా నాయ‌కుడు అప్ప‌న్నగా.. స్టైలిష్ లుక్‌లో క‌నిపిస్తూ ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై పోరాడే క‌లెక్ట‌ర్ రామ్ నంద‌న్‌ అనే రెండు పాత్ర‌ల్లో చ‌ర‌ణ్ చూపించిన పెర్ఫామెన్స్‌ వేరియేష‌న్స్‌కు ప్రేక్ష‌కుల నుంచి అమేజింగ్ రెస్పాన్స్ వ‌స్తుంది. అలాగే ఇక డాన్సుల విష‌యంలో మెగాప‌వ‌ర్ జోష్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. కియారా అద్వానీ గ్లామ‌ర్ లుక్స్‌, అంజ‌లి, శ్రీకాంత్‌, ఎస్‌.జె.సూర్య‌, జ‌య‌రాం, సునీల్ త‌దిత‌రుల న‌ట‌న‌కు సూప‌ర్బ్ అప్లాజ్ వ‌స్తోంది. సిల్వ‌ర్ స్క్రీన్‌పై ప్ర‌తీ సన్నివేశాన్ని ఎంతో గ్రాండియ‌ర్‌గా శంక‌ర్ తెర‌కెక్కించిన తీరు, దిల్‌రాజు, శిరీష్ అన్‌కాంప్ర‌మైజ్డ్ మేకింగ్ ఎక్స్‌ట్రార్డిన‌రీ. అనౌన్స్మెంట్ రోజు నుంచే సినిమాపై అంచ‌నాలు భారీ స్థాయిలో క్రియేట్ అయ్యాయి.

Read Also:Venkatesh: సింగర్ మధుప్రియతో స్టెప్పులు వేసిన వెంకీ మామ

రామ్ చ‌ర‌ణ్‌ను శంక‌ర్ ఎలా ప్రెజంట్ చేస్తారోన‌ని అంద‌రూ ఎంతో ఎగ్జ‌యిట్‌మెంట్‌తో ఎదురుచూశారు. అంద‌రి అంచ‌నాల‌ను మించుతూ శంక‌ర్ మాస్ట‌ర్ టేకింగ్, రామ్ చ‌ర‌ణ్ పెర్ఫామెన్స్‌తో గేమ్ చేంజ‌ర్ నెక్ట్స్ రేంజ్‌లో సంక్రాంతి విన్న‌ర్‌గా క‌లెక్ష‌న్స్ సునామీని క్రియేట్ చేస్తోంది. ఈ స‌క్సెస్‌ను చిత్ర యూనిట్ కంటే అభిమానులే ఘ‌నంగా సెల‌బ్రేట్ చేసుకోవ‌టం విశేషం. గేమ్ చేంజ‌ర్ స‌క్సెస్‌ను ఎంజాయ్ చేస్తోన్న ఫ్యాన్స్ రామ్ చ‌ర‌ణ్ ఇంటికి చేరుకుని త‌మ సంతోషాన్ని వ్య‌క్తం చేశారు. ఫ్యాన్స్‌ను క‌లిసిన రామ్ చ‌ర‌ణ్ వారికి కృతజ్ఞ‌తలు తెలియ‌జేశారు.

Show comments