Site icon NTV Telugu

Ram Charan : రామ్ చరణ్ బర్త్ డే కు అదిరిపోయే సర్ ప్రైజ్ ప్లాన్ చేసిన బుచ్చిబాబు..?

Buchi Baabu

Buchi Baabu

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.. ఈ సినిమా షూటింగ్ మొదలయ్యి ఎన్నో రోజులు అయ్యింది.. కానీ ఇప్పటికి సినిమా షూటింగ్ పూర్తి కాకపోవడంతో మెగా ఫ్యాన్స్ నిరాశలో ఉన్నారు.. ఇక ఈ సినిమా ఆలస్యం కావడంతో ఇప్పుడు మరో సినిమాను లైన్ లో పెట్టాడు..ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా డైరెక్షన్‌లో రామ్ చరణ్ సినిమా షూటింగ్ ప్రారంభం కాబోతోందని తెలుస్తోంది. ఈ సినిమా షూటింగ్ త్వరగా పూర్తి చెయ్యాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్..

రామ్ చరణ్ బర్త్ డే కు ఈ సినిమా నుంచి మెగా ఫ్యాన్స్ కు సర్ ప్రైజ్ గా ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసే ఆలోచనలో మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.. శంకర్ డైరెక్షన్‌లో ‘గేమ్ ఛేంజర్’ మూవీలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌కి సంబంధించి మేజర్ వర్క్ కంప్లీట్ అయ్యిందని మిగతా పార్ట్ వేసవి తర్వాత షూట్ చేస్తారని అంటున్నారు. ఈ గ్యాప్‌లోనే రామ్ చరణ్-బుచ్చిబాబు RC 16 సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు రెడీ అవుతున్నారు..

మార్చి రెండవ వారంలో ఈ సినిమా షూటింగ్ మొదలుపెట్టి మార్చి 27న రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తారని తెలుస్తోంది.. ఈ సినిమాలో రామ్ చరణ్ సరికొత్త లుక్ లో కనిపించబోతున్నాడు.. కోస్తా ఆంధ్రా యువకుడిగా కనిపించబోతున్నారని టాక్. ఇక ఆయన పక్కన ఎవరు హీరోయిన్ అనేది తెలియాల్సి ఉంది. కాగా కన్నడ స్టార్ శివ రాజ్‌కుమార్ ఈ సినిమాలో నటిస్తున్నారు. ఇతర నటీనటుల ఎంపిక కూడా జరుగుతోందట. ఈ సినిమాకి ఆస్కార్ విన్నర్ ఏఆర్.రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.. ఈ విషయం పై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది..

Exit mobile version