గత కొంతకాలంగా ప్రేమలో మునిగి తేలుతున్న రకుల్ , జాకీ భగ్నానీలు ఈరోజు వివాహబంధంలోకి అడుగు పెడుతున్నారు.. గోవా వేదికగా ఇప్పటికే వీరి పెళ్లి వేడుకలు అట్టహాసంగా ప్రారంభం అయ్యాయి. హల్దీ వేడుకతో ఈ సంబురం మొదలయ్యింది. సంగీత్తో ఇరు కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో కలిసి సరదాగా గడిపారు. నచ్చిన డ్యాన్సులు, రకరకాల ఆటలతో ఎంజాయ్ చేశారు.. ఇక వీరి సంగీత్ వేడుకలో పాల్గొని బాలీవుడ్ సెలెబ్రేటీలు సందడి చేశారు.. అందుకు సంబందించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..
వీరి పెళ్లి చాలా ప్రత్యేకంగా చేసుకొనున్నారు.. ఇవాళ ఉదయం ‘చుద్దా’ అనే సంప్రదాయ కార్యక్రమం మొదలు కానుంది. ఈరోజు 3.30 గంటల తర్వాత ITC గ్రాండ్ సౌత్ గోవాలో ఒక్కటి కానున్నారు. వీరి పెళ్లి వేడుక ఆనంద్ కరాజ్, సింధీ-శైలిలో జరగనుంది. ఇరు కుటుంబ సభ్యులకు సంబంధించిన రెండు సంప్రదాయాల ప్రకారం వివాహం జరగనుంది. ఈ వేడుకలో బంధువులు, కొద్ది మంది మిత్రులతో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖు పాల్గొననున్నారు.. కొత్త జంటను ఆశీర్వదించునున్నారు..
ఈ వివాహ వేడుకలో శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రా, టైగర్ ష్రాఫ్, అక్షయ్ కుమార్, షాహిద్ కపూర్, భూమి పెడ్నేకర్, ఈషా డియోల్, సోనమ్ కపూర్ వంటి పలువురు బాలీవుడ్ ప్రముఖులు హాజరుకానున్నారని సమాచారం.. ఇక ఈ పెళ్లి అనంతరం సన్నిహితులకు, బాలీవుడ్ ప్రమఖులకు గ్రాండ్ గా పార్టీ ఇవ్వనున్నారు.. పెళ్లి తర్వాత కొద్ది రోజులు గ్యాప్ తీసుకొని మళ్లీ సినిమాల్లో బిజీ కానున్నారని తెలుస్తుంది..