Site icon NTV Telugu

తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా రాఖీ వేడుకలు

తెలుగు రాష్ట్రాల్లో రాఖీ వేడుకలు ఘనంగా జరిగాయ్‌. తెలంగాణ సీఎం కేసీఆర్..ఏపీ సీఎం జగన్‌కు మహిళలు రాఖీలు కట్టారు. రాజకీయ నేతలకు మహిళా నేతలు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు. హైదరాబాద్‌లోని సీఎం కేసీఆర్ నివాసంలో రాఖీ వేడుకలు జరిగాయి. కేసీఆర్‌కు ఆయన సోదరీమణులు రాఖీలు కట్టి..శుభాకాంక్షలు తెలిపారు. రక్షాబంధన్ భారతీయ సంప్రదాయ ఔన్నత్యానికి నిదర్శనమన్నారు సీఎం కేసీఆర్. అటు…విజయవాడలో రాఖీ వేడుకలు జరిగాయి. సీఎం జగన్‌కు పలువురు మహిళలు రాఖీలు కట్టారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు మహిళా నేతలు..రాఖీలు కట్టి… శుభాకాంక్షలు తెలిపారు.

మహిళా కార్పొరేటర్లు, మహిళా ప్రజాప్రతినిధులు కేటీఆర్‌కు రాఖీలు కట్టారు. హైదరాబాద్‌లోని టీడీపీ అధినేత చంద్రబాబు నివాసంలో రాఖీ వేడుకలు జరిగాయి. చంద్రాబాబును కలిసిన పలువురు మహిళా నేతలు ఆయనకు రాఖీలు కట్టారు. సందర్భంగా మహిళా నేతలకు రక్షా బంధన్ శుభాకాంక్షలు తెలిపారు చంద్రబాబు. హైదరాబాద్ లోటస్ పాండ్‌లో పార్టీ నేతలు, కార్యకర్తలకు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి షర్మిల రాఖీలు కట్టి…రక్షా బంధన్ శుభాకాంక్షలు తెలిపారు. నమ్మిన సిద్ధాంతం కోసం తనతో పాటు నడుస్తున్న పార్టీ కార్యకర్తలు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నట్టు తెలిపారు వైఎస్ షర్మిల. టీఆర్ఎస్‌ ఎంపీ జోగినల్లి సంతోష్‌కు మంత్రి కేటీఆర్ కూతురు రాఖీ కట్టింది. ఈ సందర్భంగా స్వీట్ తినిపించి ఆయన రక్షా బంధన్ శుభాకాంక్షలు తెలిపారు.

Exit mobile version