Site icon NTV Telugu

Rajya sabha: రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల.. తెలంగాణలో ఎన్నంటే..!

Rajyasabha

Rajyasabha

దేశ వ్యాప్తంగా రాజ్యసభ ఎన్నికల నగరా మోగింది. మొత్తం 10 రాష్ట్రాల్లో ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. 37 రాజ్యసభ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈనెల 26న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అవుతుండగా.. మార్చి 16న ఎన్నికలు జరగనున్నాయి. ఏప్రిల్‌తో 37 మంది సభ్యుల పదవీ కాలం ముగియనుంది. తెలంగాణలో రెండు రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. అభిషేక్ సింఘ్వీ, సురేష్ రెడ్డి స్థానాలు ఖాళీ అయ్యాయి.

ఇది కూడా చదవండి: Iran-US: ట్రంప్‌నకు ఖమేనీ సవాల్.. అమెరికా యుద్ధ నౌకను సముద్రంలోనే ముంచేస్తామని వార్నింగ్

మహారాష్ట్ర, ఒడిశా, తెలంగాణ, తమిళనాడు, ఛత్తీస్‌గఢ్, పశ్చిమ బెంగాల్, అస్సాం, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, బీహార్ నుంచి 37 సీట్లు ఖాళీ అవుతున్నాయి. రాష్ట్ర శాసనసభల నుంచి ఎన్నికైన సభ్యులు రాజ్యసభ ఎన్నికల్లో ఓటు వేస్తారు. ఆరు సంవత్సరాల కాలానికి ఎగువ సభకు పంపుతారు.

Exit mobile version