Site icon NTV Telugu

Raju Yadav : ఓటీటీలోకి వచ్చేస్తున్న రాజు యాదవ్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

Raju Yadav

Raju Yadav

Raju Yadav : టాలీవుడ్ కమెడియన్ గెటప్ శ్రీను గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.జబర్దస్త్ షో ద్వారా గెటప్ శ్రీను ఎంతో పాపులర్ అయ్యాడు.వేసిన ప్రతి గెటప్ లో అద్భుతంగా నటిస్తూ బుల్లితెర కమల్ హాసన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.జబర్దస్త్ లో మంచి పాపులారిటీ రావడంతో శ్రీనుకి సినిమాలలో కమెడియన్ గా మంచి ఆఫర్స్ కూడా వచ్చాయి.చాలా సినిమాలలో శ్రీను తన కామెడీతో ఎంతగానో ఆకట్టుకున్నాడు. కమెడియన్ గా ఎంతగానో ఆకట్టుకుంటున్న శ్రీను తాజాగా “రాజు యాదవ్” చిత్రంలో హీరోగా నటించాడు.

Read Also :NBK 109 : సెట్ లో బాలయ్య, నేను సరదాగా ప్రాంక్ చేస్తుంటాం : చాందిని చౌదరి

ఈ చిత్రాన్నీ కృష్ణమాచారి కె తెరకెక్కించగా వరుణ్వి క్రియేషన్స్ పతాకంపై రాజేష్ కల్లేపల్లి ప్రశాంత్ రెడ్డి నిర్మించారు.హర్షవర్ధన్ రామేశ్వర్, సురేష్ ఈ సినిమాకు మ్యూజిక్ అందించారు. ఈ మూవీ ఈ ఏడాది మే 24వ తేదీన థియేటర్లలో రిలీజ్ అయింది.ఆసక్తికర కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమాకు విడుదలకు ముందు మంచి క్రేజ్ ఏర్పడింది. అయితే థియేటర్లలో రిలీజ్ అయ్యాక ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది. దీంతో ఈ మూవీ ఓటిటి స్ట్రీమింగ్ కు వచ్చేందుకు సిద్ధం అయింది. ఈ చిత్రం డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటిటి ప్లాట్ ఫామ్ దక్కించుకున్నట్లు సమాచారం.. జూన్ 22 న ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కు రానున్నట్లుగా ఓ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.త్వరలోనే ఈ విషయంపై మేకర్స్ అధికారిక ప్రకటన చేయనున్నట్లు సమాచారం.

Exit mobile version