థియేటర్లలో చిన్న సినిమా గా వచ్చి అందరినీ ఆశ్చర్యపరిచిన హిట్ మూవీ “రాజు వెడ్స్ రాంబాయి”. రిలీజ్ అయిన మొదటి రోజునే పాజిటివ్ టాక్ దక్కించుకుని, మూడు రోజుల్లోనే రూ. 7.5 కోట్ల గ్రాస్ సాధించి ట్రేడ్ వర్గాలను షాక్‌కు గురిచేసింది. ప్రత్యేకించి ప్రమోషన్స్ కంటే కూడా మౌత్ టాక్ ఈ సినిమాకు పెద్ద బలం అయింది. దీంతో ప్రేక్షకుల్లో “OTT ఎప్పుడు? ఏ ప్లాట్‌ఫామ్?” అన్న ఆసక్తి పెరిగింది. తాజాగా దీనికి సంబంధించిన కీలక అప్‌డేట్ బయటకొచ్చింది. ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను ఈటీవి విన్ కొనుగోలు చేసింది. నిర్మాత బన్నీ వాస్ చెప్పినట్లుగా, సాధారణంగా తెలుగు సినిమాలు నాలుగు వారాల్లోనే ఓటీటీలోకి వస్తాయి. కానీ “రాజు వెడ్స్ రాంబాయి” మాత్రం థియేటర్లలో 50 రోజులు పూర్తయ్యాక మాత్రమే OTT కి వస్తుంది. అందుకే ఈ సినిమా సంక్రాంతి 2026 సమయంలో (జనవరి 10–16 మధ్య) ఈటీవి విన్ లో స్ట్రీమ్ అయ్యే అవకాశం ఉంది. అంటే ఇంకా చాలా రోజుల పాటు థియేటర్లలోనే ఈ సినిమాను ప్రేక్షకులు ఆస్వాదించవచ్చు.
Also Read : Arasan: శింబు ‘అరసన్ ’ లోకి మరో స్టార్ హీరో ఏంట్రీ..
డైరెక్టర్‌గా సాయిలు కాంపాటి ఈ సినిమాతో తనదైన ముద్ర వేసుకున్నారు. ముఖ్యంగా చైతన్య జొన్నలగడ్డ తన నేచురల్ యాక్టింగ్‌తో హృదయాలను గెలుచుకున్నాడు. గ్రామీణ నేపథ్యంలో నడిచే ఈ ప్రేమకథా సినిమా యువతతో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్‌కి కూడా బాగా కనెక్ట్ అయింది. శివాజీ రాజా, అనితా చౌదరి తమ పాత్రలను చక్కగా పోషించారు. సురేష్ బొబ్బిలి అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, పాటలు కూడా సినిమాను మరో లెవల్‌కి తీసుకెళ్లాయి. నిర్మాతలు వేణు ఉడుగుల, రాహుల్ మొపిదేవి సినిమా నాణ్యతపై మంచి శ్రద్ధ పెట్టినట్టు స్పష్టంగా కనిపిస్తోంది.
