Site icon NTV Telugu

Rajkot fire: గేమింగ్ జోన్ ప్రమాదంలో నలుగురు అధికారుల అరెస్ట్

Feke

Feke

గుజరాత్‌లోని రాజ్‌కోట్ గేమింగ్ జోన్ అగ్నిప్రమాదం ఘటనపై దర్యాప్తు ముమ్మరం అయింది. ఈ కేసులో తాజాగా నలుగురు అధికారుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. టౌన్‌ప్లాన్ ఆఫీసర్ మన్సుఖ్ సగతియా, అసిస్టెంట్ టౌన్ ప్లానర్ ముఖేష్ మక్వానా, అసిస్టెంట్ టౌన్ ప్లాన్ గౌతమ్ జోషి, ఫైర్ స్టేషన్ ఆఫీసర్ రోహిత్ం విగోరా ఉన్నారు.

ఇది కూడా చదవండి: Rape Case: సినీ నటి రేప్… నటుడి డ్రైవర్ సహా నలుగురి అరెస్ట్!!

గత శనివారం సాయంత్రం జరిగిన అగ్నిప్రమాదంలో చిన్నారులు సహా 28 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో ఒక సహా యజమాని కూడా చనిపోయాడు. అధికారుల్ని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇటీవల అధికారుల ఇళ్లపై ఏసీబీ దాడులు చేసింది. ఇక సస్పెండ్ అయిన అధికారుల ఆస్తులు, బ్యాంక్ ఖాతాలను పరిశీలిస్తున్నారు. గేమింగ్ జోన్‌లో అనేక లోపాలు ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు.

ఇది కూడా చదవండి: Israeli Airstrike On Rafah: రఫాపై ఇజ్రాయిల్ దాడి… స్పందించిన భారత్..

Exit mobile version