NTV Telugu Site icon

Rajinikanth Net Worth: రజనీకాంత్ ఆస్తుల విలువ తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే..

Rajinikanth Net Worth

Rajinikanth Net Worth

Rajinikanth Net Worth: సౌత్ సినీ ఇండస్ట్రీ ఆరాధ్య దైవం సూపర్ స్టార్. పేరుకు కోలీవుడ్ హీరో అయినా ప్రపంచమంతా ఆయనకు అభిమానులున్నారు. ఎక్కడికి వెళ్లిన ఆయన అభిమానులు నీరాజనం పలుకుతారు. కండక్టర్ గా కెరీర్ స్టార్ట్ చేసి సినిమా రంగంలోకి అడుగుపెట్టి సూపర్‌స్టార్ గా ఎదిగాడు. తాజాగా ఆయన నటించిన కొత్త చిత్రం జైలర్ విడుదలైంది. ఫస్ట్ షో నుంచే సూపర్ డూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. దీంతో బాక్సాఫీస్ వద్ద ఓవరాల్ 1000కోట్లు కొల్లగొట్టడం ఖాయమని ఆయన అభిమానులు ఆశిస్తు్న్నారు. విడుదలైన రెండురోజుల్లోనే రూ.100కోట్లకు పైగా వసూలు చేసి అభిమానులు అంచనాలు నిజం చేసే విధంగా దూసుకుపోతుంది జైలర్.

అంతేకాకుండా రజినీ కాంత్ భారతీయ సినీ పరిశ్రమకు ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాలను అందించారు. ఎందరికో జీవితాలను ప్రసాదించాడు. అంతటి ఉన్నతమైన వ్యక్తి రజనీకాంత్‌. అయనకు ఎంత సంపద ఉందో, ఎలాంటి ఖరీదైన వస్తువులంటే ఆయనకు ఇష్టమో తెలుసుకుందాం. రజనీకాంత్ అనేక దశాబ్దాలుగా ప్రజల హృదయాలను శాసిస్తున్నారు. అతని స్టైలంటే ప్రజలను ఎంతగానో ఆకట్టుకుంది. రజనీకాంత్ 1975లో అపూర్వ రాగంగళ్ అనే తమిళ సినిమాతో అరంగేట్రం చేశారు. అప్పటి నుండి హిందీ, తమిళ పరిశ్రమలో అంచెలంచెలుగా ఎదిగారు. రజనీకాంత్ అన్నామలై (1992), బాషా (1995), మన్నన్ (1992), చంద్రముఖి (2005), శివాజీ (2007) వంటి ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాలను అందించారు.

Read Also:Raghav Chadha: రాజ్యసభ నుంచి ఆప్‌ ఎంపీ రాఘవ్ చద్దా సస్పెన్షన్

రజనీకాంత్‌కు ఎంత ఆస్తి ఉంది
భారత సూపర్ స్టార్ రజనీకాంత్ 2010 సంవత్సరంలో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తిగా ఫోర్బ్స్ పేర్కొంది. అతని మొత్తం ఆస్తులు 52 మిలియన్ డాలర్లు అంటే మన కరెన్సీలో దాదాపు రూ. 430 కోట్లు. ప్రస్తుతం రజనీ ఒక్క సినిమాకు 50 కోట్లు తీసుకుంటున్నాడు. ఒక వేళ సినిమా బాగా రాకపోతే తాను తీసుకున్న రెమ్యునరేషన్ తిరిగి ఇచ్చేస్తారని అంటున్నారు.

రజనీకాంత్ విలాసవంతమైన ఇల్లు
నటుడికి చెన్నైలోని పోయెస్ గార్డెన్‌లో విలాసవంతమైన ఇల్లు ఉంది. దీనిని అతను 2002లో ఆ ఇంటిని నిర్మించుకున్నాడు. ప్రస్తుతం దాని విలువ సుమారు 4.2మిలియన్ డాలర్లు. అంటే మన కరెన్సీలో దాదాపు రూ.35కోట్లు. అలాగే ఆయనకు రాఘవేంద్ర మండపం అనే కళ్యాణ మండపం కూడా ఉంది. ఇందులో 275 మంది అతిథులు, 1000 మందికి పైగా ఆహ్వానితులు కూర్చునే సామర్థ్యం ఉంది. దీని విలువ దాదాపు రూ.20కోట్లు ఉంటుందని అంచనా.

Read Also:Hyderabad: ఈసారి మీ వీకెండ్‌ని ఇలా ప్లాన్‌ చేసుకోండి?

రజనీ వద్ద ఉన్న కార్లు
రజనీకాంత్ వద్ద రెండు రోల్స్ రాయిస్ సహా అనేక లగ్జరీ కార్లు ఉన్నాయి. రూ.6 కోట్ల విలువైన రోల్స్ రాయిస్ ఘోస్ట్, రూ.16.5 కోట్ల విలువైన రోల్స్ రాయిస్ ఫాంటమ్ ఉన్నాయి. ఇవి కాకుండా టయోటా ఇన్నోవా, హోండా సివిక్, ప్రీమియర్ పద్మిని వంటి కార్లు కూడా ఉన్నాయి. అత్యంత ఖరీదైన వాహనాల్లో రూ. 1.77 కోట్ల విలువైన బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్5, రూ. 2.55 కోట్ల విలువైన మెర్సిడెస్, రూ. 3.10 కోట్ల విలువైన లంబోర్గినీ ఉరస్ ఉన్నాయి.