కోలీవుడ్ లో మరో సంచలన కాంబో రెడీ అవుతోంది. సూపర్ స్టార్ రజనీకాంత్, ఉలగనాయగన్ కమల్ హాసన్ కాంబినేషన్ లో సినిమా తెరకెక్కుతోంది. ఇప్పుడు ఈ వ్యవహారం కోలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. బ్లాక్ అండ్ వైట్ రోజుల నుండి ఈ ఇద్దరు స్టార్స్ నువ్వా నేనా అని పోటీపడిన సూపర్ స్టార్ రజనీ, కమల్ హాసన్ ఇప్పుడు ఒకే సినిమాలో కనిపిస్తున్నారు. ఈ ఇద్దరూ కలిపి ఓ భారీ యాక్షన్ సినిమా చేస్తున్నారు.
అయితే ఈ సినిమాను తమిళ స్టార్ దర్శకుడు లోకేష్ కనకరాజ్ డైరెక్ట్ చేస్తాడని వార్తలు వచ్చాయి. కానీ లోకేష్ కనకరాజ్ ఈ సినిమాకు కథ మాత్రమే అందించబోతున్నాడట. లోకేష్ కథతో తమిళ యంగ్ హీరో కమ్ డైరెక్టర్ ప్రదీప్ రంగరనాధ్ దర్శకత్వం వహిస్తాడని కూడా న్యూస్ వినిపించింది. కానీ అలాంటిది ఏమి లేదని చెప్పేసాడు ప్రదీప్. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం రజనీ కమల్ సినిమాకు డైరెక్టర్ ఫిక్స్ అయ్యారట. బీస్ట్, జైలర్ వంటి సూపర్ హిట్ సినిమాలను డైరెక్ట్ చేసిన నెల్సన్ దిలీప్ కుమార్ ఈ భారీ ముల్టీస్టారర్ ను డైరెక్ట్ చేయబోతున్నాడట. అందుకు సంబందించి చర్చలు కూడా ముగిసినట్టుగా తెలుస్తోంది. జైలర్ 2, అన్బరివ్ తో కమల్ చేస్తున్న సినిమాలు ఫినిష్ చేసి వచ్చే ఏడాది చివరి నాటికి లేదా 2027 ప్రారంభంలో సెట్స్ పైకి వెళ్ళే అవకాశం ఉంది. తమిళ చిత్ర పరిశ్రమలోని ఇద్దరు బడా స్టార్లు చాలా కాలం తర్వాత కలిసి నటించబోతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.
