న్యాచురల్ స్టార్ నాని ప్రస్తుతం బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు.. ఒకవైపు ఏడాదికి సరపడా సినిమాలు లైనప్ లో ఉన్న కూడా కొత్త సినిమాలను నాని లైన్లో పెడుతున్నాడు.. ఒక్కో సినిమాలో ఒక్కో వెరియేషన్లో కనిపిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు.. దసరా సినిమాతో విశ్వరూపాన్ని చూపించిన నాని.. ఈ ఏడాది హాయ్ నాన్న సినిమాతో సాలిడ్ హిట్ ను సొంతం చేసుకున్నాడు.. ఇప్పుడు సరిపోదా శనివారం సినిమా నిర్మాణంలో ఉంది.. ఇప్పటివరకు వచ్చిన అన్నీ అప్డేట్స్ బాగా ఆకట్టుకున్నాయి..
ఓజీ డైరెక్టర్ తో, బలగం వేణుతో వరుస సినిమాలు చేస్తున్నాడు.. డెబ్యూతోనే బ్లాక్ బస్టర్ అందుకున్న శ్రీకాంత్ ఓదెలకు నాని ఆల్రెడీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇంత టైట్ షెడ్యూల్ లోనూ ఒక తమిళ దర్శకుడు నానినే కావాలని వెంటపడుతున్నట్టు టాక్.. తమిళ సూపర్ స్టార్ రజినీ కాంత్ తో వెట్టయన్ సినిమాను చేస్తున్న డైరెక్టర్ టీజె జ్ఞానవేల్ ఈ సినిమాలో ఒక రోల్ కోసం నానిని సంప్రదించినట్లు సమాచారం.. అయితే నాని అందుకు నో చెప్పడంతో అతనితో ఎలాగైన సినిమా చెయ్యాలని ఫిక్స్ అయ్యాడట..
నానికి సరిపడా ఒక మంచి సబ్జెక్టు తన వద్ద ఉండటంతో జ్ఞానవేల్ రజని మూవీ తర్వాత ఇదే చేసే ప్రయత్నంలో ఉన్నాడట. ఇతని పట్టుదల గమనించిన నాని స్టోరీ చాలా నచ్చి చేద్దామని చెప్పాడట.. ఈ ఏడాది అక్టోబర్ నుంచి సినిమా సెట్స్ మీదకు వెళ్లనుందని వార్తలు వినిపిస్తున్నాయి.. ఈ వార్తల్లో నిజమేంత ఉందో తెలియాలంటే అధికారక ప్రకటన వచ్చేవరకు ఆగాల్సిందే..
