NTV Telugu Site icon

ErraCheera : రాజేంద్రప్రసాద్ మనవరాలి సినిమా శివరాత్రికి రిలీజ్

Erracheera

Erracheera

బేబి డమరి సమర్పణలో శ్రీ పద్మాయల ఎంటర్టైన్మెంట్స్ శ్రీ సుమన్ వెంకటాద్రి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం “ఎర్రచీర – ది బిగినింగ్”. ఈ సినిమాలో నటుడు రాజేంద్రప్రసాద్ ముద్దుల మనవరాలు బేబీ సాయి తేజస్విని నటిస్తోంది. “ఎర్రచీర – ది బిగినింగ్” మూవీకి సుమన్ బాబు స్వీయ దర్శకత్వం వహిస్తూ ఒక ముఖ్య పాత్ర పోషించారు. మదర్ సెంటిమెంట్, హార్రర్, యాక్షన్ కథతో ఈ సినిమా తెరకెక్కింది. ఈ నెల 27న “ఎర్రచీర – ది బిగినింగ్” గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కావలసి ఉంది. అయితే తాజాగా ఈ సినిమా బిజినెస్ షో వేశారు మేకర్స్.

Also Read : NagaVamsi : టికెట్ ధరలపై నిర్మాత నాగవంశీ కీలక వ్యాఖ్యలు

బిజినెస్ షో చూసిన తర్వాత డిస్ట్రిబ్యూటర్లందరూ సినిమా అద్భుతంగా ఉందని సినిమా తీసుకునేందుకు ముందుకు వచ్చారు. అంతేకాక థియేటర్ రిలీజ్ ఇప్పుడు హడావుడిగా కాకుండా శివరాత్రి సీజన్ లో చేస్తే బాగుంటుందని సూచించారు. సినిమా కంటెంట్ కూడా డివోషనల్ టచ్ ఉన్న కంటెంట్ కావడంతో మేకర్స్ కూడా వారు చెప్పింది నిజమేనని భావించి సినిమా రిలీజ్ వాయిదా వేశారు. వచ్చే ఏడాది శివరాత్రి సందర్భంగా ఈ సినిమాని ఫిబ్రవరి 20వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. 2025 ఫిబ్రవరి 20వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా దర్శకుడు సుమన్ బాబు మాట్లాడుతూ సినిమా చూసిన వారందరూ అద్భుతంగా ఉందని కొనియాడారని అన్నారు. సినిమా ఆలస్యం కావచ్చు కానీ కంటెంట్ మాత్రం కంటెంట్ ఖతర్నాక్ గా ఉందని చూసినవారు వెల్లడించారని ఆయన ఈ సందర్భంగా వెల్లడించారు.