Site icon NTV Telugu

Rajasthan: అమ్మాయిలు స్మార్ట్ ఫోన్లు వాడటాన్ని నిషేధించిన గ్రామ పెద్దలు..

Untitled Design

Untitled Design

ప్రస్తుతం చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు ఎవరి దగ్గర చూసినా స్మార్ట్ ఫోన్ లే కనిపిస్తున్నాయి. అయితే రాజస్థాన్ లో ఓ గ్రామ పంచాయతీ పెద్దలు.. అమ్మాయిలు, యువతులు స్మార్ట్ ఫోన్ వాడటాన్ని నిషేదిస్తూ.. తీర్పు చెప్పారు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారిపోయింది.

పూర్తి వివరాల్లోకి వెళితే.. రాజస్థాన్ జలోర్ లోని గాజీపూర్ గ్రామపంచాయితీలోని గ్రామ పెద్దలు వింత తీర్పు చెప్పారు. అమ్మాయిలు స్మార్ట్ ఫోన్లు వాడటాన్ని నిషేధించారు. అంతే కాకుండా స్మార్ట్ ఫోన్ వాడొద్దని పంచాయితీలో తీర్మాణం కూడా చేశారు. పంచాయితీ పరిధిలోని 15 గ్రామాలకు చెందిన కోడళ్లు, యువతులు స్మార్ట్ ఫోన్లు వాడకూడదని ఆంక్షలు విధించారు.

అయితే అవసరాన్ని బట్టి కీ ఫ్యాడ్ ఫోన్లు వాడుకోవచ్చని అనుమతి ఇచ్చారు గ్రామ పెద్దలు. జనవరి 26 నుండి ఈ రూల్స్ అమలులోకి వస్తాయని తీర్మాణంలో పేర్కొన్నారు. వివాహాలు, ఇతర కార్యక్రమాలకు కూడా ఫోన్లు తీసుకురాకుదని తీర్మానించారు. చిన్న పిల్లల కంటి చూపు దెబ్బతినకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పెద్దలు వెల్లడించారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. అమ్మాయిలు వాడితేనే చిన్న పిల్లల కంటిచూపు దెబ్బతింటుందా.. అబ్బాయిలు వాడితే.. ఎలాంటి సమస్య ఉండదా అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

Exit mobile version