Site icon NTV Telugu

KKR vs RR: రాజస్థాన్ పై విరుచుకుపడిన స్పిన్నర్లు.. కోల్‌కతా టార్గెట్ ఎంతంటే?

Rr Vs Kkr

Rr Vs Kkr

ఐపీఎల్ 2026 లో భాగంగా 28వ మ్యాచ్ ఈరోజు, ఆదివారం, కోల్‌కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరుగుతోంది. ఈ మ్యాచ్ కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరుగుతోంది. రాజస్థాన్ రాయల్స్ టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 09 వికెట్ల నష్టానికి 154 పరుగులు సాధించింది. కోల్ కతాకు 155 పరుగుల టార్గెట్ ను ఫిక్స్ చేసింది. కోల్ కతా స్పిన్నర్లు రాజస్థాన్ పై విరుచుకుపడడంతో భారీ స్కోర్ కు బ్రేక్ పడినట్లైంది.

Also Read:Weather Updates : తెలుగు రాష్ట్రాల్లో మండిపోతున్న ఎండలు

టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న రాజస్థాన్ ఇన్నింగ్స్‌ను వైభవ్ సూర్యవంశీ, యశస్వి జైస్వాల్ ప్రారంభించారు. ఇద్దరూ నిలకడగా ఆడుతూ ఆరో ఓవర్‌లో జట్టు స్కోరును 50 దాటించారు. తొమ్మిదో ఓవర్‌లో వైభవ్ సూర్యవంశీ వికెట్ కోల్పోవడంతో రాజస్థాన్‌కు తొలి ఎదురుదెబ్బ తగిలింది. వరుణ్ తన స్పిన్‌తో వైభవ్‌ను బోల్తా కొట్టించడంతో, 28 బంతుల్లో 46 పరుగులు చేసి ఔటయ్యాడు. వైభవ్ ఆరు ఫోర్లు, రెండు సిక్సర్లు కొట్టాడు. వైభవ్ సూర్యవంశీ తర్వాత వరుణ్ చక్రవర్తి, ధ్రువ్ జూరెల్‌ను ఔట్ చేశాడు. జూరెల్ 5 పరుగులకే ఔటయ్యాడు. సునీల్ నరైన్ బౌలింగ్‌లో యశస్వి జైస్వాల్ 39 పరుగుల వద్ద ఔటయ్యాడు. కెప్టెన్ రియాన్ పరాగ్ 12 పరుగుల వద్ద వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో ఔటవడంతో నాలుగో వికెట్‌ను కోల్పోయింది. సునీల్ నరైన్, డోనవన్ ఫెరీరాను 7 పరుగుల వద్ద ఔట్ చేశాడు. కార్తిక్ త్యాగి, రవీంద్ర జడేజాను 9 పరుగుల వద్ద ఔట్ చేశాడు. కార్తి త్యాగి బౌలింగ్‌లో షిమ్రాన్ హెట్మయర్ 15 పరుగుల వద్ద ఔటయ్యాడు.

Exit mobile version