కోల్‌కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు ఈడెన్ గార్డెన్స్‌లో మరికాసేపట్లో తలపడనున్నాయి. ఈ మ్యాచ్ కోసం అంతా సిద్ధమైంది. ఈ మ్యాచ్ లో భాగంగా రాజస్థాన్ రాయల్స్ టాస్ గెలిచి, మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో కోల్ కతా ఫీల్డింగ్ చేయనుంది. కోల్‌కతా ఇప్పటివరకు ఆరు మ్యాచ్‌లు ఆడి ఐదింటిలో ఓడిపోయింది. వర్షం కారణంగా ఒక మ్యాచ్ రద్దయింది. దీంతో కోల్ కతా మొదటి విజయం కోసం ఎదురుచూస్తోంది. రాజస్థాన్ రాయల్స్ గత మ్యాచ్‌లో ఓటమి చవిచూసింది. తిరిగి విజయాల బాట పట్టాలని చూస్తోంది. ఇరుజట్ల ముఖాముఖి రికార్డు విషయానికి వస్తే, కోల్‌కతాదే పైచేయి. 32 మ్యాచ్‌లు ఆడగా, కోల్‌కతా 16 గెలిచింది. రాజస్థాన్ 14 గెలవగా, రెండు మ్యాచ్‌లు ఫలితం లేకుండా ముగిశాయి.
KKR vs RR: టాస్ గెలిచిన రాజస్థాన్.. కోల్‌కతా ఈరోజైనా ఖాతా తెరిచేనా?..

Rrvs Kkr