Site icon NTV Telugu

Rajampeta Crime: రాజంపేటలో ఒళ్లు గగుర్పొడిచే ఘటన.. భార్య ప్రాణాలు పోతుంటే నవ్వుతూ రికార్డ్ చేసిన భర్త!

Sriram Srinivas

Sriram Srinivas

Rajampeta Crime: నువ్ చచ్చిపో.. వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటా.. ఇదీ ఓ భర్త తీరు. భర్త మాటలు.. వేధింపులకు బిత్తరపోయిన ఆ ఇల్లాలు ఉరి వేసుకునే ప్రయత్నం చేసింది. తన కళ్ల ముందే ఘాతుకానికి పాల్పడుతున్నా.. ఆ నరరూప రాక్షసుడు ఇసుమంత కూడా కరగలేదు. పైగా ఉరి అలా కాదు ఇలా వేసుకోవాలి అని చెబుతూనే వీడియో కూడా తీశాడు నీచుడు. మరింత కుంగిపోయిన ఆ ఇల్లాలు.. భర్త వీడియో తీస్తుండగానే.. ఉరికి వేలాడి విగత జీవిగా మారింది. కడప జిల్లా రాజంపేటలో జరిగిన ఈ ఘటన రెండు రాష్ట్రాల్లో కలకలం రేపింది.

READ ALSO: SKLM MARPHING: మార్ఫింగ్ మాయ..

అతని పేరు శ్రీరామ్ శ్రీనివాస్. కడప జిల్లా రాజంపేట స్వస్థలం. నందలూరులో రైల్వే ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. లోకోపైలట్‌గా ఉద్యోగం చేస్తున్న శ్రీరామ్‌ శ్రీనివాస్‌‌.. ఆరేళ్ల క్రితం కృష్ణవేణిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. కొద్ది రోజులు కాపురం బాగానే చేశాడు. కానీ అనంతరం తనలోని సైకోను బయటపెట్టాడు. మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్న శ్రీరామ్.. భార్యను వేధింపులకు గురి చేశాడు. నువ్ చచ్చిపో.. చచ్చిపో .. అని నిత్యం వేధిస్తుండేవాడు. భర్త ఆగడాలు భరించలేని.. తొలుత శ్రీరామ్ వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళతో గొడవ పడింది. ఆమె ఫోన్ నంబర్ సంపాదించి మరీ గొడవలకు దిగింది. దీన్ని జీర్ణించుకోలేని శ్రీరామ్.. కృష్ణవేణి నుంచి ఫోన్ లాగేసుకున్నాడు. అంతే కాదు.. అందులో ఉన్న కాల్ రికార్డ్స్ అన్నీ డిలీట్ చేశాడు. అప్పటి నుంచి కృష్ణవేణిని మరింత టార్చర్ చేయడం మొదలు పెట్టాడు. భర్త తీరును తల్లిదండ్రులు, సోదరునికి వివరించి చెప్పి బాధపడింది కృష్ణవేణి. పలుమార్లు పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టించినా శ్రీరామ్ ప్రవర్తనలో మార్పులేదు. పైగా వేధింపుల డోస్ మరింత పెంచాడు.

ఈ క్రమంలో బాధలు భరించలేని కృష్ణవేణి.. బలవన్మరణానికి సిద్ధపడింది. ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోవాలని డిసైడైంది. అదే సమయంలో ఇంట్లోనే ఉన్నాడు భర్త శ్రీరామ్. ఇద్దరి మధ్య గొడవ కూడా జరిగింది. దీంతో మరింత మనస్థాపంతో ఉరి వేసుకుంటానని తెగేసి చెప్పింది. అందుకోసం చీర ఫ్యాన్‌కు కట్టేసింది. ఆ సమయంలో భర్త శ్రీరామ్ వీడియో తీశాడు. ఆమె ఉరి వేసుకుంటూ ఉంటే ఆపాల్సింది పోయి మరింత రెచ్చగొట్టాడు. ఉరి అలా కాదు.. ఇలా వేసుకోవాలని సూచనలు ఇచ్చాడు. పైగా అదంతా ఫోన్‌లో నవ్వుతూ రికార్డ్ చేశాడు. నువ్ చచ్చిపోతే మరో అమ్మాయిని పెళ్లి చేసుకుంటా చచ్చిపో చచ్చిపో అంటూ చెప్పుకొచ్చాడు. ఆ మాటలన్నీ వీడియోలో రికార్డయ్యాయి. ఐతే ఓ సమయంలో కృష్ణవేణి బలవన్మరణాన్ని వద్దనకుని దిగుతున్నప్పటికీ.. భర్త శ్రీరామ్ చేష్టలతో విసిగిపోయి.. అలాగే ఉరికి వేలాడి ప్రాణాలు కోల్పోయింది కృష్ణవేణి.

ఈ అమానుష ఘటనపై స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు రంగంలోకి దిగారు. కృష్ణవేణి డెడ్ బాడీ ఉన్న గది తలుపులు బద్ధలు కొట్టారు. మృతదేహాన్ని బయటకు తీసి.. పోస్ట్ మార్టమ్ కోసం తరలించారు. మరోవైపు భార్య మృతికి కారణమైన శ్రీరామ్ శ్రీనివాస్‌ను అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి మొబైల్ తీసుకుని వీడియోను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన తర్వాత శ్రీరామ్ లీలలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. గతంలో మొదటి భార్య కూడా అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఆమె రైలు పట్టాలపై విగత జీవిగా పడి ఉందని అప్పట్లో పోలీసులు గుర్తించారు. ఐతే ఆ కేసు తేలక ముందే.. కృష్ణవేణిని రెండో పెళ్లి చేసుకున్నాడు. తమకు ఇష్టం లేకపోయినప్పటికీ.. రైల్వే ఉద్యోగం ఉందన్న కారణంతో ఒప్పుకున్నట్లు కృష్ణవేణి సోదరుడు తెలిపారు. తమకు శ్రీరామ్ మొదటి పెళ్లి గురించి తెలియదన్నారు. శ్రీరామ్ శ్రీనివాస్‌కు ఏదైనా మానసిక సమస్యా? లేదా సైకోలా ప్రవర్తిస్తాడా? అనే కోణంలో కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. అయితే ఆ వీడియో వెనుక ఉన్న అసలు కారణం ఏంటి? ఉద్దేశపూర్వకంగానే ఆత్మహత్యకు ప్రేరేపించాడా? అని దర్యాప్తు కొనసాగుతోంది. మొత్తంగా భార్య చనిపోతుంటే వీడియో తీయడమే కాకుండా.. సైకోలా ప్రవర్తించిన తీరుపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.

READ ALSO: Vijay TVK: తమిళ పాలిటిక్స్‌లో బిగ్ ట్విస్ట్.. ఎన్డీఏ గూటికి దళపతి విజయ్?

Exit mobile version