Site icon NTV Telugu

Rajamouli-Mahesh : రాజమౌళి మహేష్ సినిమాలో తమిళ్ స్టార్ హీరో..?

Rajamouli Mahesh Babu

Rajamouli Mahesh Babu

తెలుగులో స్టార్ డైరెక్టర్ లిస్ట్ మొదటగా రాజమౌళి పేరు వినిపిస్తుంది.. ఆయన తీసిన సినిమాలు అన్నీ కూడా బాక్సాఫీస్ ను షేక్ చేసినవే.. ఆయన చేసిన సినిమాలు ఎంత పెద్ద విజయం సాధించాయో మనందరికీ తెలిసిందే.. ఇక త్రిపుల్ ఆర్ సినిమా ఆస్కార్ కు నామినేట్ అయ్యింది.. తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పారు.. ఆయనతో సినిమాలు చెయ్యాలని స్టార్ హీరోలు ఆసక్తి చూపిస్తున్నారు.. త్రిపుల్ ఆర్ తర్వాత ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే…

మరోసారి ఇండియాలోనే కాకుండా, హాలీవుడ్ రేంజ్ లో తన సత్తా చాటడానికి రెడీ అవుతున్నాడు. ఇక ఈ సినిమాలో మహేష్ బాబు అడ్వెంచర్లు కూడా చేయబోతున్నట్టుగా సమాచారం.. ఈ సినిమా జక్కన్న ఇప్పటివరకు తీసిన సినిమాల కన్నా ఈ సినిమా డిఫరెంట్ గా ఉంటుందని తెలుస్తుంది.. ప్రతి ఫ్రెమ్ కొత్తగా ఉండబోతుందని తెలుస్తుంది.. ఈ సినిమాలో ఇక ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసుకున్న ఈ సినిమాలో తమిళ్ సినిమా ఇండస్ట్రీకి చెందిన విక్రమ్ కూడా ఒక కీలకపాత్రలో నటించబోతున్నట్టుగా సమాచారం అయితే అందుతుంది.

అయితే ఆయన విలన్ పాత్రలో కనిపించునున్నారా.. లేక చిన్న రోల్ చేస్తారా అన్నది మాత్రం తెలియలేదు.. ఈ సినిమాలో తప్పకుండా ఒక క్యారెక్టర్ లో నటిస్తున్నట్టుగా సమాచారం అనేది బయటికి లీక్ అయింది. ఇక ఈ సినిమాలో విక్రమ్ కనక చేసినట్లయితే ఆయన నటనతో విశ్వరూపం చూపిస్తాడని చెప్పడం లో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.ఇక రాజమౌళి సినిమాల్లో నటులు తనదైన రీతిలో రెచ్చిపోయి నటిస్తూ ఉంటారు.ఇక దానికి తగ్గట్టుగానే విక్రమ్ అయితే వేరే సినిమాల్లోనే అద్భుతమైన నటనను కనబరుస్తాడు.. మరి దీనిపై అధికార ప్రకటన వచ్చేవరకు వెయిట్ చెయ్యాల్సిందే..

Exit mobile version