Varanasi: రెండు భాగాలుగా ‘వారణాసి’.. జక్కన్న రియాక్షన్ ఇదే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Varanasi: దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్లో రూపొందుతున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘వారణాసి’. ప్రస్తుతం ఈ సినిమా చుట్టూ ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. సుమారు రూ.1000 కోట్ల భారీ బడ్జెట్‌తో, టైమ్ ట్రావెల్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా రెండు భాగాలుగా విడుదలయ్యే అవకాశం ఉందన్న వార్త ఇప్పుడు టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇటీవల విడుదలైన ‘ధురందర్’, ‘ధురందర్ 2’ చిత్రాలు సాధించిన అఖండ విజయం రాజమౌళి ఆలోచనా విధానాన్ని మార్చినట్లు జోరుగా ప్రచారం జరుగుతుంది. ఈ మెగా స్టోరీని కేవలం మూడు గంటల్లో చెబితే న్యాయం జరగదని, అందుకే సినిమాను రెండు భాగాలుగా తీసుకురావాలని నిర్మాతలు తీవ్రంగా ఆలోచిస్తున్నట్లు పలు నివేదికలు చెబుతున్నాయి.
READ ALSO: Amaravati Legal Status: అమరావతికి చట్టబద్ధత.. నేడే ఏపీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం..
Also Read
- Motkupalli Narasimhulu: ఎన్టీఆర్‌ను గుర్తుచేసుకుంటూ మోత్కుపల్లి భావోద్వేగం.. “మనసున్న నాయకుడిని మళ్లీ చూడలేం”
- భారత్‌లో Sony BRAVIA 7 II RGB Mini LED 4K టీవీల లాంచ్.. అద్భుత ఫీచర్లతో సరికొత్త సిరీస్.!
- Vaibhav Sooryavanshi: సచిన్ కలలు చూపించాడు.. ధోనీ నమ్మకం నేర్పించాడు.. కోహ్లీ గర్జించాడు.. ఇక వైభవ్ సూర్యవంశీ యుగం ప్రారంభమైందా..?
- ఒకే కారు.. మూడు ఆప్షన్లు.. పెట్రోల్, సీఎన్జీ, ఈవీతో సరికొత్త Tata Tiago రిలీజ్.. ధర రూ. 5 లక్షల లోపే..
కథ బలంగా ఉంటే ప్రేక్షకులు రెండు భాగాలుగా చూడటానికి సిద్ధంగా ఉన్నారని ‘ధురందర్’ నిరూపించడంతో, రాజమౌళి కూడా తన కథను ఎలాంటి తొందరపాటు లేకుండా విడతల వారీగా వెండితెరపైకి తేవాలని భావిస్తున్నట్లు ఈ నివేదికలు పేర్కొంటున్నాయి. అయితే, ఈ వార్తలను రాజమౌళి గతంలోనే ఖండించడం గమనార్హం. గత నెలలో ఓ అంతర్జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జక్కన్న మాట్లాడుతూ.. ‘వారణాసి’కి సీక్వెల్స్ ఉండవని, ఇది ఒకే భాగంగా వస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఇది మూడు గంటలకు పైగా నిడివి ఉండే ఒకే చిత్రంగా ఉంటుందని చెప్పారు. బాహుబలి, ‘RRR’తో ప్రపంచవ్యాప్త గుర్తింపు తెచ్చుకున్న రాజమౌళి, ఇప్పుడు ‘వారణాసి’తో మరో గ్లోబల్ బ్లాక్ బస్టర్పై కన్నేశారు. ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ వంటి స్టార్స్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.
READ ALSO: IPL 2026: ఆర్సీబీ తుది జట్టు ఇదే.. విరాట్ కోహ్లీతో కలిసి ఓపెనింగ్ చేసేది ఆ స్టార్ ప్లేయరేనా!
తాజావార్తలు
-
Motkupalli Narasimhulu: ఎన్టీఆర్‌ను గుర్తుచేసుకుంటూ మోత్కుపల్లి భావోద్వేగం.. “మనసున్న నాయకుడిని మళ్లీ చూడలేం”
-
భారత్‌లో Sony BRAVIA 7 II RGB Mini LED 4K టీవీల లాంచ్.. అద్భుత ఫీచర్లతో సరికొత్త సిరీస్.!
-
Vaibhav Suryavanshi: అన్బిలీవబుల్ ప్లేయర్.. వండర్ కిడ్.. పవర్ బ్యాటింగ్‌కు బ్రాండ్ అంబాసిడర్!
-
Ajit Agarkar: “వైభవ్ ఇంకా చిన్నోడే”.. టీమిండియాలోకి బుడ్డోడి ఎంట్రీపై బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ సంచలన వ్యాఖ్యలు..
-
Drishyam 3 : మోహన్ లాల్ ఖాతాలో మరో రికార్డ్.. జస్ట్ 7 రోజుల్లో సెన్సేషన్
ట్రెండింగ్
-
Dondakaya Roti Pachadi: పల్లీల స్పెషల్ టచ్‌తో ‘దొండకాయ రోటి పచ్చడి’.. టేస్ట్ చేస్తే లొట్టలేసుకుంటూ తింటారంతే.!
-
144Hz OLED డిస్ప్లే, 7500mAh బ్యాటరీతో గేమింగ్ మాన్స్టర్ REDMAGIC 11S Pro గ్లోబల్ లాంచ్.!
-
MG Majestor : రూ.40 లక్షల SUV కేవలం రూ.41,000లకే..!
-
Home Remedies : వర్షాకాలం వచ్చేస్తోంది.. దోమల బెడదకు ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి..!
-
స్టైలిష్ డిజైన్, 50MP పెరిస్కోప్ కెమెరా, IP69K రెసిస్టెన్స్ తో OPPO Reno16 సిరీస్ లాంచ్..