Site icon NTV Telugu

SSMB29 Updates: మాట తప్పని జక్కన్న.. 15 ఏళ్ల క్రితం ఫిక్స్ అయిన మహేష్ బాబు కాంబో

Ssmb29 Update, Mahesh Babu Rajamouli Movie

Ssmb29 Update, Mahesh Babu Rajamouli Movie

SSMB29 Updates: భారతీయ సినిమా చరిత్రలో దర్శకధీరుడు రాజమౌళికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టాలీవుడ్‌కు పరిమితమైన తెలుగు సినిమా స్థాయిని ప్యాన్ ఇండియా స్థాయికి తీసుకెళ్లిన వ్యక్తి జక్కన్న. బాహుబలి సినిమాతో తెలుగు సినిమాను ప్రపంచ వ్యాప్తంగా పరిచయం చేసిన ఘనత రాజమౌళిది. బాహుబలి, ఆర్ఆర్ఆర్ లాంటి ప్యాన్ ఇండియా సినిమాలు తీసిన తర్వాత ఆయన దర్శకత్వంలో రాబోయే కొత్త సినిమాపై ఏ రేంజ్‌లో అంచనాలు ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటిది ఆయన ఇచ్చిన మాటను తప్పకుండా మాటను నిలబెట్టుకున్నారని ఒక నిర్మాత చెప్పారు. ఇంతకీ ఆ నిర్మాత ఎవరూ, జక్కన్న ఆయనకు ఏ మాట ఇచ్చారు అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం..

READ ALSO: BSNL: బీఎస్ఎన్ఎల్ సిల్వర్ జూబ్లీ ప్లాన్‌.. డైలీ 2.5GB డేటా.. తక్కువ ధరకే

హిట్‌ కొట్టడమే ఆలస్యం, నెక్ట్స్ సినిమా మాకే చెయ్యాలంటూ చాలా మంది నిర్మాతలు దర్శకుడి వెంట పడటం ఇండస్ట్రీలో సర్వసాధారణం. అలాంటిది రాజమౌళి లాంటి స్టార్ డైరెక్టర్ల వెంట పడే వారి సంఖ్య ఇంక ఏ రేంజ్‌లో ఉంటుందో వర్ణించడం కూడా కష్టం అవుతుంది. అలా ఎంత మంది బడా నిర్మాతలు ఈ దర్శకధీరుడి వెంట పడిన ఆయన మాత్రం ఆర్ఆర్ఆర్ తర్వాత తన నెక్ట్స్ సినిమా కె.ఎల్‌. నారాయణకు చేస్తున్నట్లు పేర్కొని సినీ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేశారు. వాస్తవానికి శ్రీ దుర్గా ఆర్ట్స్‌.. కె.ఎల్‌. నారాయణకు జక్కన్న కొన్నేళ్ళ క్రితం సినిమా చేస్తానని మాట ఇచ్చారు. అప్పుడు ఈ సినిమాకు మహేష్ బాబు హీరోగా ఫిక్స్ అయ్యారు. కె.ఎల్. నారాయణకు జక్కన్న ఈ మాట ఎప్పుడు ఇచ్చాడో తెలుసా.. 15 ఏళ్ల క్రితం. అలా ఆయనకు ఇచ్చిన మాట తప్పకుండా జక్కన్న దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న చిత్రం #GlobeTrotter/#SSMB29 (వర్కింగ్‌ టైటిల్స్‌). ఇంత గొప్ప స్థాయిలో ఉండి ఎంతో మంది బడా నిర్మాతలు సినిమాలు చేయాలని వెంటపడుతున్నా రాజమౌళి తాను ఇచ్చిన మాటకు కట్టుబడి కె.ఎల్.నారాయణకు చేస్తున్నారని సిని వర్గాలు చెబుతున్నాయి.

గతంలో ‘శ్రీ దుర్గా ఆర్ట్స్‌’ పతాకంపై నారాయణ నిర్మించిన సినిమాలు ఏమిటంటే.. ‘క్షణ క్షణం’, ‘హలో బ్రదర్‌’, ‘ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు’, ‘సంతోషం’.. మొదలైన చిత్రాలను రూపొందించారు. ఆయన బ్యానర్‌లో రూపొందించినా సినిమాలు తక్కువనే అయినా, సినిమాలపై ప్రత్యేకమైన అభిరుచి ఉన్న నిర్మాతగా ఇండస్ట్రీలో కె.ఎల్‌. నారాయణ ప్రత్యేకమైన పేరును సంపాదించుకున్నారు. ఆయన నిర్మాతగా వ్యవహరించిన ఆఖరి సినిమా ‘రాఖీ’. ఆ తర్వాత వేరే రెండు ప్రాజెక్టులు ఖరారైనా కొన్ని అనివార్య కారణాల వల్ల అవి ఆగిపోయాయి. ఒక ఇంటర్వ్యూలో కె.ఎల్‌. నారాయణ మాట్లాడుతూ.. దాదాపు 15 ఏళ్ల క్రితం జక్కన్నతో మహేష్ బాబు సినిమాను ఖరారు చేశామన్నారు. కానీ ఆ తర్వాత రాజమౌళి బాహుబలి సినిమా, ఆ తర్వాత ఆర్ఆర్ఆర్ సినిమాలతో బిజీ కావడంతో ఈ క్రేజీ కాంబో లేట్ అయ్యిందని చెప్పారు. అయినా రాజమౌళి ఇచ్చిన మాటకు కట్టుబడి తనకు సినిమా చేస్తున్నట్లు వెల్లడించారు. కానీ ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పటి వరకు ప్రకటించలేదు. శనివారం సాయంత్రం ఈ సినిమాకు సంబంధించిన ఈవెంట్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరగనుంది. ఈ కార్యక్రమంలో జక్కన్న-మహేష్ బాబు క్రేజీ సినిమాపై పూర్తి వివరాలు వెల్లడించనున్నట్లు సమాచారం.

READ ALSO: Jadeja Leaves CSK: జట్టు మారిన జడేజా.. సంజు కోసం చెన్నై కీలక నిర్ణయం

Exit mobile version