Site icon NTV Telugu

Ayyappa Swamy Temple: ఏపీలో మరో “శబరిమల”.. గోదావరి నది తీరాన కొలువైన అయ్యప్ప..

Shabarimala

Shabarimala

Ayyappa Swamy Temple: దక్షిణ భారతదేశం ఉండే ప్రసిద్ధి పుణ్యక్షేత్రాల్లో శబరిమల అయ్యప్ప స్వామి ఆలయం ఒకటి. దేశం నలుమూలలు నుంచి భక్తులు శబరిమలకు వస్తారు. అయ్యప్ప దర్శనం కోసం వచ్చే భక్తులు మండల కాలం పాటు అంటే 41 రోజులు దీక్ష తీసుకుని ఇరుమడి కట్టుకుంటారు. మాలధారణ చేసిన స్వాములు 41 రోజుల పాటు భక్తి శ్రద్ధలతో, నియమ నిష్టలతో అయ్యప్ప స్వామిని పూజిస్తారు. అయితే.. కొంత మంది మాల దారులు పలు కారణాలతో అంత దూరం వెళ్లలేరు. అలాంటి వారి కోసం ఏపీలో అచ్చం శబరిమల ఆలయం మాదిరిగా ఓ దేవాలయాన్ని నిర్మించారు. ఈ అయ్యప్ప ఆలయం శబరిమల మాదిరిగానే నిత్య పూజలు సైతం నిర్వహిస్తారు. ఇంతకీ ఈ ఆలయం ఏపీలో ఎక్కడ ఉంది..? దీన్ని ఎవరు నిర్మించారు..? దీని ప్రత్యేకతలు ఏమిటి? అనే అంశాల గురించి తెలుసుకుందాం..

READ MORE: AP Cyber crime: ఏపీలో సైబర్ నేరాల విచారణలో కీలక పరిమాణం

హ‌రి హ‌ర పుత్రుడు అయ్యప్పస్వామి ఆల‌యం ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రిలో గోదావ‌రి న‌దీతీరాన‌ నిర్మించారు. ఏపీలో ఎంతో ప్రాధాన్యత పొందిన ఈ గుడిని 2011 మార్చి 20న అప్పటి ఎమ్మెల్యే దివంగ‌త నేత జక్కంపూడి రామ్మోహనరావు నిర్మించారు. ఆయ‌న భక్తికి, స్ఫూర్తికి ఈ ఆలయం ప్రతీకగా చిర‌కాలం నిలిచిపోతుందన‌డంలో ఏ మాత్రం సందేహం లేదు. స్థల సేకరణ నుంచి నిర్మాణ వ్యయ బాధ్యతల వ‌ర‌కు ఆయ‌న మీదే వేసుకుని ఏంతో అద్భుతమైన‌ ఆలయాన్ని నిర్మించారు. అయ్యప్ప మాల ధరించే భక్తులు సహజంగా శబరిమలలో ఇరుముడి చెల్లిస్తారు. కానీ ఏపీలో ఉన్న ఈ గుడిలోనూ ఇరుముడి స‌మ‌ర్పించ‌వ‌చ్చట! శబరిమల‌ మాదిరే ఇక్కడ కూడా అనేక ఉపాలయాల ఉన్నాయి. అందులో ప్రధానంగా గణపతి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, సాయి బాబా, లక్ష్మీహయగ్రీవ స్వామి, మాలికాపుర అమ్మవారు, దక్షిణామూర్తి స్వామి, దత్తాత్రేయలాంటి వారి ఆల‌యాలు కూడా ఉన్నాయి.

READ MORE: Kakani Govardhan Reddy: నష్టపోయిన పంటల గురించి చంద్రబాబు ఎందుకు మాట్లాడటం లేదు..?

గుడి నిర్మించిన రామ్మోహన్ రావు చనిపోయినా.. ఆయ‌న కుటుంబీకులు ఆశ‌యాన్ని కొన‌సాగిస్తూ ఎంతో మంది భ‌క్తుల‌కు సౌక‌ర్యాలు స‌మ‌కూర్చి దైవ ద‌ర్శనం క‌ల్పిస్తున్నారు. శ్రీ ధ‌ర్మశాస్త్ర ఆధ్యాత్మిక కేంద్రంగా పిలవబడే ఈ ఆల‌యంలో నిత్యం మ‌ణికంఠుడి నామంతో మార్మోగుతుంది. అయ్యప్ప మాలాధారులు ఇత‌ర భక్తులు, చిన్ని స్వాములతో ఈ గుడి నిత్యం ఎంతో సందడిగా ఉంటుంది. ఆలయ నిర్మాణం కూడా దాదాపు శ‌బ‌రిమ‌ల ప‌ద్ధతిలోనే ఉంటుంది. గుడి నిర్మాణానికి కోటప్పకొండ నుంచి శిలను తీసుకువ‌చ్చార‌ని, ఇక్కడికి వ‌చ్చే స్వాముల కోసం అన్ని ఏర్పాట్లు చేసి హిందూ సంప్రదాయాల ప్రకారం పూజ‌లు జ‌రిపిస్తామ‌ని జక్కంపూడి రాజా వెల్లడించారు. అంతే కాదు అయ్యప్ప స్వామి మూల విరాట్ విగ్రహాన్ని పంచలోహాలతో తయారు చేయించి ప్రతిష్టించడం కూడా మ‌రో ప్రత్యేకత అని తెలిపారు. అయ్యప్ప స్వాములు ఈ గుడిని సందర్శించండి.. అయ్యప్ప స్వామిని దర్శించుకుని తరించండి..

Exit mobile version