రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రెస్టీజియస్ మూవీ “రాజా సాబ్”. టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మాతలు. మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ ఈ చిత్రంలో హీరోయిన్స్ గా నటిస్తున్నారు. సంక్రాంతి సందడిని రెట్టింపు చేసేందుకు ఈ నెల 9న “రాజా సాబ్” సినిమా వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. గత సినిమా ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ ను హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.
Also Read : TheRajaSaab : ఇది రెబెల్ స్టార్ రేంజ్.. భారత ఏకైక నటుడుగా రికార్డ్
ప్రొడ్యూసర్ టీజీ విశ్వప్రసాద్ మాట్లాడుతూ ‘మూడేళ్ల క్రితం రాజా సాబ్ జర్నీ మొదలైంది. మొదట హారర్ కామెడీ చేయాలని అనుకున్నాం. ఆ తర్వాత మరింత స్కేల్ పెంచి హారర్ ఫాంటసీగా మార్చాం. ఇప్పటిదాకా మన ఇండియన్ సినిమాలో ఇంత హ్యూజ్ హారర్ ఫాంటసీ మూవీ రాలేదు. ఒక ప్రెస్టీజియస్ మూవీగా రాజా సాబ్ ను ప్రొడ్యూస్ చేయడంలో మేము సక్సెస్ అయ్యామని నమ్ముతున్నాం. హారర్, కామెడీ, రొమాన్స్, యాక్షన్, ఎమోషన్ అన్నీ ఈ మూవీ కథలో బాగా కుదిరాయి. టెక్నికల్ గా మేకింగ్ గ్రాండియర్ కు తగిన అన్ని ఎలిమెంట్స్ మూవీలో బ్యాలెన్స్డ్ గా ఉంటాయి. తమిళనాట 150 నుంచి 200 స్క్రీన్స్ ప్రస్తుతం లభించాయి. నార్త్ ఇండియాలో 4500 స్క్రీన్స్ లో రాజాసాబ్ రిలీజ్ అవుతోంది. ఏపీలో టికెట్ రేట్స్ హైక్ ఇచ్చారు, తెలంగాణలో రేపటికి అనుమతి వస్తుందని ఆశిస్తున్నాం. కోర్టు నుంచి క్లియరెన్స్ వచ్చింది. సంక్రాంతికి 11 సినిమాలు వస్తున్నాయి. అన్నింటికీ థియేటర్స్ కావాలి కాబట్టి పోటీ ఉంది. 8వ తేదీ నుంచి అన్ని ఏరియాల్లో రాజా సాబ్ కు మంచి థియేటర్స్ ఉంటాయి. ప్రభాస్ గారు బాహుబలి ముందు ఎలా కనిపించారో అలా రాజా సాబ్ లో ఆయన్ని చూడబోతున్నారు. సినిమా చివరి 40 నిమిషాలు ఒక గ్లోబల్ మూవీ ఇంపాక్ట్ ఇస్తుంది. మరో 5 నిమిషాల ఫాంటసీ ఎలిమెంట్ ను పండుగ టైమ్ లో యాడ్ చేయబోతున్నాం. రాజా సాబ్ కు మొదటి రోజు గ్లోబల్ గా రూ. 100 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు వస్తాయని ఆశిస్తున్నాం. అన్నారు.
