Weather Alert: 7 రాష్ట్రాలకు భారీ వర్షసూచన.. ఏఏ స్టేట్స్ అంటే..!

Imd

Imd

దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని కేంద్ర వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ మేరకు ఆయా రాష్ట్రాలకు వార్నింగ్ ఇచ్చింది. అప్రమత్తంగా ఉండాలని సూచించింది. 7 రాష్ట్రాలకు సంబంధించిన జాబితాను వాతావరణ శాఖ విడుదల చేసింది.

శుక్రవారం నుంచి శనివారం వరకు.. ఇలా రెండ్రోజుల పాటు పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని ఐఎండీ(IMD) తెలిపింది.

మార్చి 1న హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లో కూడా వర్షాలతో పాటు మంచు కురిసే అవకాశం ఉందని పేర్కోంది. అలాగే మార్చి 2న ఢిల్లీ, చండీగఢ్, జమ్మూకాశ్మీర్‌లో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.