వర్షం కారణంగా బ్రిస్బేన్‌లో జరిగిన మూడో టెస్టు డ్రా అయిన సంగతి తెలిసిందే.. ఈ క్రమంలో సిరీస్‌లో ప్రస్తుతం ఇరు జట్లు 1-1తో సమమైంది. అయితే గురువారం నుంచి ప్రారంభమయ్యే బాక్సింగ్ డే టెస్టుపై ఇరు జట్లు కన్నేశాయి. ఈ మ్యాచ్‌లో గెలిచి తమ ఆధిపత్యాన్ని పెంచుకోవాలని చూస్తున్నాయి. ఈ మ్యాచ్ సిరీస్ విజేతను నిర్ణయించడమే కాకుండా ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు అర్హత సాధించే అవకాశాలకు కూడా భారత్‌కు ముఖ్యమైనది. ఉత్కంఠభరితంగా సాగే మరో మ్యాచ్‌లో ఆధిక్యం సాధించాలని ఇరు జట్లూ ఉవ్విళ్లూరుతున్నాయి. అయితే.. నాలుగో టెస్ట్ మ్యాచ్‌కు వర్ష గండం ఉన్నట్లు తెలుస్తోంది. ఒక వేళ వర్షం పడితే.. ఈ టెస్ట్ కూడా డ్రా అయ్యే అవకాశాలు ఉన్నాయి. వర్ష సూచన, హెడ్ టు హెడ్ రికార్డ్‌లు, లైవ్ స్ట్రీమింగ్, పిచ్ మరియు వాతావరణ నివేదిక, పూర్తి స్క్వాడ్ గురించి తెలుసుకుందాం….
CM Revanth Reddy : రేపు సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల భేటీ
మెల్‌బోర్న్ వాతావరణ సూచన:
భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా నాలుగో టెస్టు మ్యాచ్ సందర్భంగా మెల్బోర్న్ వాతావరణ సూచన మిశ్రమంగా ఉంది. మొదటి రోజు (26 డిసెంబర్) వర్షం పడే అవకాశం 50% ఉంది. సాయంత్రం బలమైన గాలులు వీచే అవకాశం ఉంది. రెండవ రోజు కూడా ఇలాంటి వాతావరణం ఉంటుంది. ఉదయం వర్షం పడవచ్చు. అయితే మూడో రోజు నుంచి పరిస్థితి మెరుగుపడుతుందని.. వర్షం పడే అవకాశాలు 30% మాత్రమేనని అంచనా వేస్తున్నారు. నాలుగు, ఐదవ రోజులలో వర్షం పడే అవకాశం తక్కువగా ఉంది.
ఇరు జట్లు ఇప్పటి వరకు 110 టెస్టుల్లో తలపడ్డాయి. ఇందులో భారత్‌పై ఆస్ట్రేలియా జట్టుదే పై చేయి ఉంది.
ఆడిన మొత్తం మ్యాచ్‌లు: 110
ఆస్ట్రేలియా గెలిచింది: 46
టీమిండియా గెలిచింది: 33
డ్రా అయిన మ్యాచ్‌లు: 30
టై మ్యాచ్‌లు: 01
పిచ్ రిపోర్ట్
మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లోని పిచ్ చాలా పోటీగా పరిగణించబడుతుంది. ఈ పిచ్ బౌలర్లు, బ్యాటర్లకు సహకరిస్తుంది. ఆట ప్రారంభంలో మంచి బౌన్స్ ఉంటుంది. ఆట జరుగుతున్న కొద్దీ.. పిచ్ పాతబడడంతో బ్యాట్స్‌మెన్ తమ షాట్‌లను మరింత సులభంగా ఆడగలరు. స్పిన్నర్లకు ఈ పిచ్ పెద్దగా అనుకూలించదు. 1996 నుండి మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ మ్యాచ్‌ల కోసం డ్రాప్-ఇన్ పిచ్‌లను ఉపయోగిస్తోంది.
లైవ్ స్ట్రీమింగ్ వివరాలు
భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా 4వ టెస్టు 2024 డిసెంబర్ 26 నుంచి 30 వరకు జరగనుంది. ఈ మ్యాచ్ మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ)లో జరగనుంది. భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా సిరీస్‌లోని నాల్గవ టెస్టు ఉదయం 5:00 గంటలకు ప్రారంభమవుతుంది. అయితే టాస్ 30 నిమిషాల ముందుగా ఉదయం 4:30 గంటలకు జరుగుతుంది. 4వ టెస్ట్ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారాన్ని ఇండియాలో టీవీలో స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్, డీడీ స్పోర్ట్స్‌లో చూడవచ్చు. మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం డిస్నీ+ హాట్‌స్టార్ యాప్, వెబ్‌సైట్‌లో చూడవచ్చు.