రైల్వేలో ఉద్యోగాల జాతర కొనసాగుతోంది. ఇటీవలె 22 వేల గ్రూప్ డీ పోస్టుల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ ముగిసింది. తాజాగా భారతీయ రైల్వే నిరుద్యోగులకు గుడ్ న్యూస్ అందించింది. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టుల భర్తీకి షాట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ రిక్రూట్‌మెంట్ కోసం ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ వచ్చే నెల మే 15న ప్రారంభమై, జూన్ 14, 2026 వరకు కొనసాగుతుంది. అర్హులైన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్, rrbapply.gov.in లో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
Also Read:Fauji: నో డౌట్స్.. గట్టిగా ఫిక్స్ అయ్యారు!
ఈ నియామకానికి దరఖాస్తు చేసుకోవడానికి, అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు/సంస్థ నుండి 10వ తరగతి, ఐటిఐ పూర్తి చేసి ఉండాలి. లేదా 10వ తరగతి పూర్తి చేసి ఇంజనీరింగ్‌లో డిప్లొమా పొంది ఉండాలి. ఇంజనీరింగ్ డిగ్రీ ఉన్న అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులకు కనీసం 18 సంవత్సరాల నుండి గరిష్టంగా 30 సంవత్సరాల వయస్సు ఉండాలి. ఓబీసీలకు 3 సంవత్సరాలు, ఎస్సీ/ఎస్టీలకు 5 సంవత్సరాల వయో సడలింపు ఉంటుంది. నిబంధనల ప్రకారం ఇతర రిజర్వ్డ్ కేటగిరీలు, మాజీ సైనికులు కూడా వయో సడలింపునకు అర్హులు.
Also Read:YS Jagan: పార్లమెంట్ చరిత్రలో డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడ్డ ఎంపీ పుట్టానే.. సీఎం నో యాక్షన్!
ఎంపిక
అసిస్టెంట్ లోకో పైలట్ ఖాళీ పోస్టులకు ఎంపిక కావడానికి, అభ్యర్థులు CBT 1, CBT 2, కంప్యూటర్ ఆధారిత ఆప్టిట్యూడ్ టెస్ట్ (CBAT), డాక్యుమెంట్ వెరిఫికేషన్ (DV), మెడికల్ ఎగ్జామినేషన్ (ME) ప్రక్రియలలో పాల్గొనవలసి ఉంటుంది. అభ్యర్థులు దరఖాస్తు ఫారంతో పాటు రూ.500 డిపాజిట్ చేయాల్సి ఉండగా, ఎస్సీ/ఎస్టీ/మాజీ సైనికులు/ట్రాన్స్‌జెండర్/ఈబీసీ అభ్యర్థులు రూ.250 చెల్లించాల్సి ఉంటుంది. పూర్తి వివరాలకు ఈ లింక్ పై క్లిక్ చేయండి.
