NTV Telugu Site icon

Janata Bar Movie: హీరోయిన్ గా రీ ఎంట్రీ ఇస్తున్న రాయ్ లక్ష్మీ.. హీరో ఎవరంటే?

Janata Bar

Janata Bar

ఒకప్పుడు హీరోయిన్ గా కొన్ని సినిమాల్లో నటించింది.. ఆ సినిమాలు స్టార్ హీరోయిన్ గా పేరును అందివ్వలేదు.. దాంతో ఐటమ్ గర్ల్ గా మారింది.. తన అంద చందాలతో కుర్ర కారును తనవైపు తిప్పుకుంది.. స్టార్ హీరోలతో స్టెప్పులు వేయించింది.. ఇప్పుడు తెలుగులో మళ్లీ హీరోయిన్‌గా రీ ఎంట్రీ ఇవ్వనుంది.. హీరో శ్రీకాంత్ చేతుల మీదుగా ట్రైలర్ ను లాంచ్ చేశారు..

రాయ్ లక్ష్మీ హీరోయిన్ గా నటిస్తున్న సినిమా జనతాబార్.. రోచిశ్రీ మూవీస్ పతాకపంపై అశ్వథ్‌ నారాయణ సమర్పణలో రమణ మొగిలి స్వీయదర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు శక్తి కపూర్ కీలక పాత్రలో నటించబోతున్నాడు.. జనతా బార్ ట్రైలర్‌ను హీరో శ్రీకాంత్ విడుదల చేశాడు.. ఆ ట్రైలర్ కొత్తగా ఉంది.. సినిమా పై ఆసక్తిని పెంచుతుంది..

అన్ని పనులను పూర్తి చేసుకున్న ఈ సినిమా వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.. కుస్తీ నేపథ్యంలో తెరకేక్కుతున్న ఈ సినిమాలో స్త్రీ ప్రాధాన్యతను చాటి చెప్పే కథగా రాబోతుంది… బార్ గర్ల్ గా మొదలైన అమ్మాయి. కుస్తీ పోటిల్లో ఎలా రానిస్తుంది.. సమాజంలో ఆమె ఎలా రానిస్తుంది.. సినిమా మొత్తం సరికొత్తగా ఉండబోతుందని డైరెక్టర్ చెబుతున్నారు.. ఈ సినిమా విడుదల తేదీని త్వరలోనే ప్రకటించనున్నారు..
Laxmi Raai’s Janatha Bar Movie Trailer Launch by Hero Srikanth || Deeksha Panth | Tollywood