Site icon NTV Telugu

Rahul Gandhi: మరో యాత్ర చేయనున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ… రూట్ మ్యాప్ ఇదే..

Rahulgandhi22

Rahulgandhi22

Rahul Gandhi: ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ మరో యాత్ర చేయనున్నారు. ఇప్పటికే భారత్ జోడో పేరుతో రెండు యాత్రలు చేసి దేశం చుట్టి వచ్చారు. ఇక ఆదివారం నుంచి 16 రోజుల పాటు బీహార్ లో ఓటర్ అధికార్ యాత్ర చేయనున్నారు. ఓటర్ అధికార్ యాత్రలో బీహార్ లోని ఆర్జేడీ కీలక నేత తేజస్వీ యాదవ్ తో పాటు ఇండియా కూటమి నేతలు పాల్గొంటారు. లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, బీహార్‌లోని ససారం నుంచి ఆగస్టు 17 న ఓటర్ అధికార్ యాత్ర మొదలు పెట్టనున్నారు. ఈ యాత్రలో 1300 కిలోమీటర్ల దూరాన్ని కవర్ చేయనున్నారు. రాహుల్ యాత్ర సెప్టెంబర్ 1న పాట్నాలో జరిగే మహాసభతో ముగియనుంది. గతంలో ఆయన చేసిన ప్రతి యాత్ర ప్రజాస్వామ్యంలో కొత్త పేజీలను ఆవిష్కరించిదని కాంగ్రెస్ చెప్తోంది.

READ MORE: Manda Krishna Madiga: పెన్షన్ పెంచుతావా గద్దె దిగుతావా? రేవంత్‌రెడ్డికి మంద కృష్ణ మాదిగ వార్నింగ్..

బీహార్‌లో ఓటర్ల ప్రత్యేక సవరణ (SIR) పేరుతో దళితులు, ఆదివాసీలు, మైనార్టీలు, పేదలు, కూలీల వంటి లక్షలాది మంది ఓటర్లను జాబితా నుంచి తొలగించేందుకు బీజేపీ కుట్ర పన్నిందని రాహుల్, కాంగ్రెస్, ఇండియా కూటమి నేతలు ఆరోపిస్తున్నారు. ఇవాళ ఓటు హక్కును లాక్కున్నారు. రేపు వారికి ఉచిత ఆహారం, ఇల్లు వంటి ప్రభుత్వ పథకాలలో వాటా నిరాకరిస్తారు. బీహార్ లో జరుగుతున్న కుట్ర చాలా లోతుగా ఉందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. అందుకే బీహార్ ప్రజలకు వాస్తవాలు తెలిపేందుకు ఓటర్ అధికార్ యాత్ర చేపడుతున్నామని చెపుతోంది కాంగ్రెస్.

Exit mobile version