Site icon NTV Telugu

Rahul Gandhi: కులగణనతోనే పేదలకు మేలు

Rahul

Rahul

కాంగ్రెస్‌ (Congress) అధికారంలోకి రాగానే దేశవ్యాప్తంగా కులగణన చేపడతామని ఆ పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) ప్రకటించారు. భారత్ జోడో న్యాయ యాత్రలో భాగంగా ఆయన గుజరాత్‌లో పర్యటిస్తున్నారు.

కులగణన చేపట్టి.. దీనిద్వారా 50 శాతం రిజర్వేషన్ల పరిమితిని ఎత్తి వేయొచ్చని రాహుల్‌ గాంధీ పేర్కొన్నారు. కులగణనతో పాటు ఆర్థిక స్థితిగతుల విశ్లేషణ ద్వారా ఇప్పటివరకు ఉన్న 50 శాతం రిజర్వేషన్ల పరిమితిని ఎత్తేయొచ్చన్నారు. పేదల కోసం సరైన విధానాలు, ప్రణాళికలను రూపొందించడమే కాక విద్య, వైద్యం ఇలా అనేక రంగాల్లో అభివృద్ధికి సహాయపడుతుందని ఆయన పేర్కొన్నారు.

బిహార్‌లో నిర్వహించిన కులగణన సర్వేలో పేదల్లో 88 శాతం మంది దళిత, గిరిజన, వెనకబడిన, మైనారిటీ వర్గాల వారే ఉన్నట్లు తేలిందన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కులగణన, ఆర్థిక స్థితిగతుల నమోదు అనే రెండు చరిత్రాత్మక చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

Exit mobile version