Rahul Gandhi: లోక్‌సభ ప్రతిపక్షనేత, కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, హరియాణా, కర్ణాటకలోని పలు ప్రాంతాల్లో ఎన్నికల సమయంలో జరిగిన ఓట్ల చోరీ గురించి సంచలన ఆరోపణ చేసిన విషయం తెలిసిందే. బీజేపీ, ఎన్నికల సంఘం కలిసి ఎన్నికల్లో ‘భారీ నేరపూరిత మోసానికి’ పాల్పడ్డాయని చేసిన ఆరోపణలపై ఈసీ సీరియస్ అయ్యింది. ఆగస్టు 1న తాము బిహార్‌లో 65 లక్షల ఓట్లను తొలగిస్తున్నామని ప్రకటన విడుదల చేసినా.. ఇప్పటివరకు ఏ పార్టీ తమను మార్పులు చేర్పులపై సంప్రదించలేదని ఈసీ తెలిపింది. ఓట్ల తొలగింపుపై విమర్శలు చేస్తున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, సైతం ముసాయిదాపై ఇంతవరకు ఎటువంటి అభ్యంతరాలు నమోదు చేయలేదని పేర్కొంది. తాము విడుదల చేసిన ఓట్ల తొలగింపు ముసాయిదాపై రాహుల్ గాంధీ బిహార్ ఎన్నికలు పూర్తయ్యాక తన అభ్యంతరాలు చెప్తారేమో అని ఈసీ వ్యంగ్యాస్త్రాలు విసిరింది.
READ MORE: The Paradise : ది ప్యారడైజ్ నుంచి పవర్ ఫుల్ పోస్టర్ రిలీజ్..
ఆధారాలు ఈసీ ముందే ఉన్నాయి..: ప్రియాంక
ఎన్నికల కమిషన్ తీరుపై కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ ఫైర్ అయ్యారు. దర్యాప్తు చేయడం మానేసి ఈసీ రాహుల్ గాంధీ తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారని, దబాయిస్తోందన్నారు. మహారాష్ట్ర, హరియాణా మొదలైన ప్రాంతాల్లో ఎన్నికల సమయంలో అవకతవకలు జరిగినట్లు పేర్కొన్న వెంటనే ఈసీ ఆ విషయంలో అసలు దర్యాప్తే చేయనప్పుడు రాహుల్ వాదనలు తప్పని ఎన్నికల కమిషన్‌కు ఎలా తెలుస్తుందని ప్రశ్నించారు. తాము సమర్పించిన ఆధారాలు ఈసీ ముందే ఉన్నాయని, వాటిని పరిణగణలోకి తీసుకొని దర్యాప్తు చేయాలని సూచించారు. రాజ్యాంగంపై దాడి చేసేటప్పుడు, రాజ్యాంగ విలువలను అపహాస్యం చేసేటప్పుడు ఎన్నికల అధికారులు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాలని లోక్‌సభ పక్షనేత రాహుల్ గాంధీ హెచ్చరించారు. తాను చేస్తున్న ఆరోపణలపై ప్రమాణం చేయాలని ఈసీ చేస్తున్న డిమాండ్‌ను తిప్పికొట్టారు. తాను ఇప్పటికే ఎంపీగా పార్లమెంట్ సాక్షిగా రాజ్యాంగంపై ప్రమాణం చేశానన్నారు. ఎన్నికల్లో అవకతవకలకు పాల్పడిన వారిని పట్టుకోవడానికి ఎక్కువ సమయం పట్టినా.. ఎప్పటికైనా తప్పనిసరిగా వారిపై చర్యలు తీసుకుంటామన్నారు.
READ MORE: Rahul Gandhi Asks EC: దేశానికి ఈసీ సమాధానం చెప్పాలి.. 5 ప్రశ్నలు సంధించిన రాహుల్ గాంధీ!
