Site icon NTV Telugu

Rahul Gandhi life threat: ప్రాణాలు రిస్క్‌లో ఉన్నాయి.. రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు..!

05

05

Rahul Gandhi life threat: లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకుడు, ఎంపీ రాహుల్ గాంధీ పూణేలోని ప్రత్యేక కోర్టుకు హాజరైన సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. వీర్ సావర్కర్‌పై తాను చేసిన ప్రకటన కారణంగా తన ప్రాణాలకు ముప్పు ఉందని అన్నారు. బహిరంగంగా ఇద్దరు నాయకులు తనను బెదిరించారని రాహుల్ తెలిపారు. తాను కోర్టుకు హాజరైన సమయంలో అదనపు భద్రతను కల్పించాలని రాహుల్ డిమాండ్ చేశారు.

READ MORE: CM Chandrababu: పులివెందుల రీపోలింగ్‌పై స్పందించిన సీఎం చంద్రబాబు.. ఏమన్నారంటే..?

కోర్టుకు రాహుల్ ఎందుకు వచ్చారంటే..
సత్యకి సావర్కర్ అనే ఫిర్యాదుదారుడు పూణేలోని ప్రత్యేక కోర్టులో రాహుల్ గాంధీపై కేసు దాఖలు చేశారు. వాస్తవానికి ఈ కేసు వీర్ సావర్కర్‌పై పరువు నష్టం కలిగించే వ్యాఖ్యలకు సంబంధించినది. ఈక్రమంలో కోర్టుకు హాజరైన రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫిర్యాదుదారుడు నాథూరామ్ గాడ్సే, గోపాల్ గాడ్సే వారసుడని, వారి చరిత్ర హింసాత్మక కార్యకలాపాలతో ముడిపడి ఉందని అన్నారు.

రాహుల్ గాంధీ తరఫున న్యాయవాది మిలింద్ దత్తాత్రయ పవార్ కోర్టుకు లిఖితపూర్వక దరఖాస్తును సమర్పించారు. ఫిర్యాదుదారుడు నాథూరామ్ గాడ్సే, గోపాల్ గాడ్సే వారసులని, వారి చరిత్ర హింసాత్మక కార్యకలాపాలతో ముడిపడి ఉందని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ప్రస్తుత రాజకీయ వాతావరణం, కొంతమంది నాయకుల వివాదాస్పద ప్రకటనలతో రాహుల్ గాంధీ ప్రాణాలకు తీవ్రమైన ముప్పు పొంచి ఉందని పవార్ పేర్కొన్నారు.

రాహుల్ గాంధీ పిటిషన్‌లో రవ్‌నీత్ సింగ్ బిట్టు పేరు ప్రస్తావించారు. రాహుల్‌ను దేశంలోనే నంబర్ వన్ ఉగ్రవాదని రవ్‌నీత్ అభివర్ణించినట్లు పిటిషన్‌లో పేర్కొన్నారు. పిటిషన్‌లో బీజేపీ నాయకుడు తర్విందర్ సింగ్ మార్వా పేరు కూడా చేర్చారు. రాహుల్ గాంధీ పరిస్థితి తన నానమ్మ పరిస్థితిలా ఉంటుందని తర్విందర్ సింగ్ అన్నారని తెలిపారు. విచారణకు హాజరయ్యే సమయంలో రాహుల్‌ గాంధీకి అదనపు భద్రత కల్పించాలని ఆయన తరుఫు న్యాయవాది కోర్టును అభ్యర్థించారు.

READ MORE: India Stops Buying Russian Oil: రష్యా నుంచి చమురు కొనుగోలు నిలిపివేస్తే.. ఇండియా పరిస్థితి ఏంటి..?

Exit mobile version