‘ఓటు చోరీ’కి వ్యతిరేకంగా, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవడానికి నవంబర్ 1న నిర్వహించనున్న ‘చలో ఢిల్లీ రామ్‌లీలా మార్చ్’లో ప్రజలందరూ భాగస్వాములు కావాలని కాంగ్రెస్ నాయకుడు, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు. రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని కోరారు. సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ లో పంచుకున్న ఒక వీడియో సందేశంలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ఈ పాదయాత్ర ఓట్ల దొంగతనాన్ని అడ్డుకోవడానికేనని, ఇది ఏ ఒక్క రాజకీయ పార్టీకి సంబంధించినది కాదని స్పష్టం చేశారు. ఇది భారత ఆత్మకు సంబంధించిన యాత్ర అని అభివర్ణించారు. నరేంద్ర మోదీ, అమిత్ షా, జ్ఞానేష్ కుమార్ వైఖరితో విసిగిపోయిన వారు, ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడుకోవాలనుకునే వారందరూ ఈ మార్చ్‌లో పాల్గొనాలని కోరారు.
नमस्कार,
चलो दिल्ली रामलीला मार्च, लोकतंत्र को बचाने का, वोट चोरी को रोकने का, संविधान को बचाने का मार्च है।
यह किसी एक राजनीतिक पार्टी का मार्च नहीं – यह हिंदुस्तान की आत्मा का मार्च है।
सब लोग जो नरेंद्र मोदी, अमित शाह, ज्ञानेश कुमार से तंग हैं। सब लोग जो लोकतंत्र को बचाना चाहते हैं, संविधान की रक्षा करना चाहते हैं, आप सब आइए।
एक ही protest है – देश का protest है।
Don’t worry about the police, don’t worry about lathis – the BJP will not have the guts to try any of their antics.
Come march with us – we will walk together to protect the Constitution, to protect the Indian nation.
घबराने की जरूरत नहीं है।
I urge all student groups, regardless of your political affiliation – if you feel that India is under attack, if you feel you are under attack, your expression, your ideas, your way of thinking is under attack, come and join us.
It will be a fantastic march, and it’s a march for the soul of this country.
Looking forward to seeing all of you there.
🗓️ 1 नवंबर
📍 रामलीला मैदान, नई दिल्ली#ChaloDilli
— Rahul Gandhi (@RahulGandhi) October 29, 2026
పోలీసుల చర్యలకు లేదా లాఠీలకు భయపడాల్సిన అవసరం లేదని రాహుల్ గాంధీ ప్రజలకు ధైర్యాన్నిచ్చారు. భాజపా ప్రభుత్వం ఎలాంటి వికృత చర్యలకు పాల్పడే సాహసం చేయలేదని, రాజ్యాంగాన్ని, దేశాన్ని రక్షించుకోవడానికి అందరం కలిసి అడుగులు వేద్దామని చెప్పారు. ఆందోళన చెందకుండా దేశం కోసం, మీ హక్కుల కోసం జరుగుతున్న ఈ యాత్రలోకి రావాలని పిలుపునిచ్చారు. రాజకీయ లబ్ధితో సంబంధం లేకుండా విద్యార్థి సంఘాలు కూడా ఈ మార్చ్‌లో చేరాలని ఆయన విజ్ఞప్తి చేశారు. దేశంపై, మీ భావప్రకటనా స్వేచ్ఛపై, ఆలోచనా విధానంపై దాడి జరుగుతోందని అనిపిస్తే తప్పకుండా రావాలని కోరారు. ఈ యాత్ర భారత దేశ ఆత్మ కోసం జరుగుతున్నదని, అందరినీ అక్కడ చూడటానికి ఎదురుచూస్తున్నానని తెలిపారు.
మరోవైపు.. నవంబర్ 1న రామ్‌లీలా మైదానంలో ‘ఇండియా’ కూటమి నిర్వహించనున్న ఈ భారీ ర్యాలీ కోసం కాంగ్రెస్ పార్టీ విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ‘ఇండియా’ కూటమి ఎంపీలతో సమావేశమయ్యారు.

