Site icon NTV Telugu

Bharat Jodo Yatra: రాహుల్‌ గాంధీ వర్సెస్ బాలుడు.. రోడ్డుపైనే పుషప్స్‌ ఛాలెంజ్..

Rahul Gandhi

Rahul Gandhi

Bharat Jodo Yatra: కాంగ్రెస్ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన భారత్‌ జోడో యాత్ర కర్ణాటకలోని చిత్రదుర్గం జిల్లాలోకి ప్రవేశించింది. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు తలపెట్టిన ఈ యాత్రలో భాగంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రజల్లో కలియతిరుగుతూ వారి సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. భారత్ జోడో యాత్రలో పలుమార్లు ఆసక్తికర సన్నివేశాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా మరో ఆసక్తికర ఘటన జరిగింది. పలు సన్నివేశాల ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ కాగా.. తాజాగా కర్ణాటకలో రోడ్డుపైనే పుషప్స్ తీసిన 52 ఏళ్ల రాహుల్‌ గాంధీ అందరిలో ఉత్సాహం నింపారు. రాహుల్ గాంధీ, ఇతర కాంగ్రెస్ నేతలు, ఒక బాలుడు పుషప్స్ చేస్తున్న వీడియోను కాంగ్రెస్ ట్వీట్ చేసింది. ఆ పోస్ట్‌కు పుషప్స్ ఛాలెంజ్‌ అని క్యాప్షన్‌ను జోడించారు. బాలుడు, రాహుల్‌తో పోటీపడినట్లు ఆ వీడియోలో కనిపించింది. ఛాలెంజ్ ముగిసిన తర్వాత రాహుల్ గాంధీ బాలుడితో కరచాలనం చేశారు. వీడియో చూసిన కాంగ్రెస్‌ కార్యకర్తలు పుషప్స్ ఛాలెంజ్‌లో ఎవరు గెలిచారు? అని ప్రశ్నిస్తున్నారు.

Video Games: వీడియో గేమ్స్‌తో పిల్లలకు ప్రాణాపాయం.. గుండె సమస్యలు తప్పవు..!!

ఓ బాలుడితో కలిసి రాహుల్‌ గాంధీ, కర్ణాటక పీసీసీ చీఫ్‌ డీకే శివకుమార్‌, పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ పుష్‌అప్‌లు తీసిన ఫొటోను ఆ పార్టీ సీనియర్‌ నేత రణ్‌దీప్‌ సూర్జేవాలా ట్విటర్‌లో షేర్‌ చేశారు. అలాగే, కాంగ్రెస్‌ సోషల్‌ మీడియా సమన్వయకర్త నితిన్‌ అగర్వాల్‌ ‘రాహుల్‌ పుష్‌ అప్‌ ఛాలెంజ్‌’ అని పేర్కొంటూ వీడియోను పంచుకున్నారు. ఇటీవల వర్షంలో తడుస్తూ రాహుల్‌ గాంధీ తన ప్రసంగాన్ని కొనసాగించారు. దీనితో పాటు ఇటీవల కర్ణాటక కాంగ్రెస్ సీనియర్ నేత సిద్ధరామయ్య చేయి పట్టుకుని రాహుల్‌ పరిగెత్తడం, పార్టీ జెండా పట్టుకొని డీకే శివకుమార్‌తో కలిసి రన్‌లో పాల్గొనడం వంటి దృశ్యాలు వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే.

 

 

Exit mobile version