Ragi Laddu Recipe: కాల్షియం పవర్‌హౌస్ ‘రాగి లడ్డు’.. తింటే పిల్లల నుంచి పెద్దల వరకు ఫిదా అవ్వాల్సిందే!

Ragi Laddu

Ragi Laddu

Ragi Laddu Recipe: ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ధాన్యాలలో రాగి ఒకటి. కాల్షియం, ఐరన్‌, ఫైబర్‌, ప్రోటీన్‌ లు ఎక్కువగా ఉండే రాగి చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ చాలా మంచిది. రాగితో లడ్డు చేస్తే రుచిగా ఉండటమే కాకుండా శక్తిని కూడా ఇస్తుంది. మరి అలంటి ‘రాగి లడ్డు’ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

Dhurrander 2: అడివి శేష్ వర్సెస్ రణ్‌వీర్ సింగ్.. డెకాయిట్ రిలీజ్ డేట్ మారబోతుందా?

కావలసిన పదార్థాలు:
* రాగి పిండి – 1 కప్పు,
* బెల్లం – ¾ కప్పు,
* నెయ్యి – 3 టేబుల్ స్పూన్లు,
* ఎలకల పొడి – అర టీస్పూన్,
* జీడిపప్పు – 8 నుంచి 10,
* బాదం లేదా పల్లీలు – కొద్దిగా (ఇష్టమైతేనే*).

తయారీ విధానం:
ముందుగా ఒక పాన్ తీసుకుని అందులో రాగి పిండిని వేసి తక్కువ మంటపై వేయించాలి. మంచి వాసన వచ్చేవరకు పిండి మాడకుండా నెమ్మదిగా కలుపుతూ సన్నమంటలో వేయించాలి. రాగి పిండి వేగిన తర్వాత దానిని ఒక ప్లేట్‌లోకి తీసి చల్లారనివ్వాలి. ఇక అదే పాన్‌లో కొద్దిగా నెయ్యి వేసి జీడిపప్పు, బాదం లేదా పల్లీలను వేయించి పక్కన పెట్టుకోవాలి. బెల్లాన్ని చిన్న ముక్కలుగా చేసి మిక్సీలో పొడిలా చేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో రాగి పిండి, బెల్లం పొడి, వేయించిన డ్రైఫ్రూట్స్, ఎలకల పొడి వేసి బాగా కలపాలి. చివరిగా నెయ్యిని కొద్దికొద్దిగా పోస్తూ చేతితో కలిపి లడ్డు ఆకారంలో ఒత్తాలి.

Share Market: జీవం పోసిన అమెరికా-భారత్ ట్రేడ్ డీల్.. భారీ లాభాలతో ముగిసిన స్టాక్‌మార్కెట్లు

రాగి లడ్డు ప్రయోజనాలు:
* ఎముకలు బలంగా మారేందుకు సహాయపడుతుంది.
* శరీరానికి శక్తిని ఇస్తుంది.
* రక్తహీనత సమస్య తగ్గించడంలో సహాయపడుతుంది.
* పిల్లల ఎదుగుదలకు ఎంతో మంచిది.