Raghurama Krishnaraju : సీఐడీ రిటైర్డ్ ఏఎస్పీ విజయ్‌పాల్ ను అరెస్ట్ చేయడం సంతోషంగా అనిపించిందన్నారు ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు. ఇవాళ ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. సీఐడీ రిటైర్డ్ ఏఎస్పీ విజయ్ పాల్ ఎన్నో దందాలు చేశారని, ఆయన పాపం పండిందన్నారు. తెలియదు అని క్రిమినల్ లాగా సమాధానాలు చెప్తున్నారు అని తెలిసిందని, నన్ను కస్టోడియల్ టార్చర్ చేశారని ఆయన వ్యాఖ్యానించారు. అసలు కుట్ర చేసింది పీవీసునీల్ కుమార్ అని ఆయన అన్నారు. నన్ను కస్టోడియాల్ టార్చర్ చేసిన వారిలో కీలక నిందితుడిని నిన్న పోలీసులు అరెస్ట్ చేశారని రఘురామ అన్నారు. అందరూ కలిసి కుట్ర చేశారు, ఇప్పటికే ఆలస్యం అయ్యిందని, పీవీ సునీల్ కుమార్ ప్రధాన నిందితుడు అని రఘురామ కృష్ణరాజు మండిపడ్డారు.
Nizamabad: క్లినిక్ లపై తెలంగాణ వైద్య బృందం తనిఖీలు.. నకిలీ వైద్యుల గుట్టు రట్టు..
ఆయన తులసి వనంలో గంజాయి మొక్క లాంటి వారని, పీవీ సునీల్ కుమార్ కి లుక్ ఔట్ నోటీసులు ఇవ్వాలన్నారు. పీవీ సునీల్ కుమార్ దేశం విడిచి పారిపోకుండా చూడాల్సిన బాధ్యత రాష్ట్ర పోలీసుల పై ఉందన్నారు. సునీల్ కుమార్, విజయ్ పాల్ అంత ఒక ముఠా అని, నన్ను టార్చర్ చేసిన వారికి న్యాయస్థానంలో తప్పకుండా శిక్షపడుతుందని నమ్మకం ఉందన్నారు. A5 కి హాస్పటల్ సూపర్ డెంట్ ప్రభావతి పేరు ను కూడా ఎఫ్.ఐ ఆర్ లో నమోదు చేశారని, మెడికల్ రిపోర్ట్ కూడా అప్పుడు ఇవ్వలేదన్నారు. ఈ కేసులో అందరిని శిక్షించడానికి ఎక్కువ సమయం పట్టదన్నారు.
Hemant Soren: ప్రధాని మోడీతో హేమంత్ సోరెన్ దంపతుల భేటీ.. సీఎం ప్రమాణస్వీకారానికి రావాలని ఆహ్వానం..