Site icon NTV Telugu

BJP MP Raghunandan Rao: మానిఫెస్టోలో మొదటి పేజీనే అమలుకు నోచుకోలేదు..

Raghunandan Rao

Raghunandan Rao

BJP MP Raghunandan Rao: అభయ హస్తం మేనిఫెస్టోలో ప్రజా దర్బార్ ను నిర్వహిస్తాం అన్నారు.. ప్రజా దర్బార్ నిర్వహించడానికే కాంగ్రెస్ కు చేతకాలేదని బీజేపీ ఎంపీ రఘునందన్‌ రావు విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కేసీఆర్ అవినీతి రూ. లక్ష కోట్లు కక్కిస్తాం అన్నారు..? ప్రజలకు పంచుతాం అన్నారు..? ఏమైంది..? అని ప్రశ్నించారు. కేసీఆర్ కుటుంబం నుంచి కక్కించిన మొత్తం డబ్బు ఎంతో..? ముఖ్యమంత్రి శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. జీవో 111 వెనక లక్షల కోట్ల కుంభకోణం అన్నారు.. అది ఏమైందో ముఖ్యమంత్రి చెప్పాలన్నారు. బీఆర్ఎస్ 30 శాతం కమిషన్ సర్కార్ అన్నారు. ప్రస్తుతం ఎంత కమిషన్ నడుస్తుంది ముఖ్యమంత్రి చెప్పాలి? అని నిలదీశారు.

RREAD MORE: CM Chandrababu: కాశీబుగ్గలో తొక్కిసలాట.. సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి..

కాంగ్రెస్ అభయ హస్తం కాదు.. ఆది భస్మాసుర హస్తమని జూబ్లీహిల్స్ ప్రజలు గమనించాలన్నా ఎంపీ రఘునందన్‌రావు.. మానిఫెస్టోలో మొదటి పేజీనే అమలుకు నోచుకోలేదన్నారు. రాష్ట్రం ఒక్క నియోజక వర్గంలో గుంటేడు జాగా స్మశాన వాటిక కు ఇవ్వలేదన్నారు.కానీ షేక్ పేట్‌లో కబ్రస్థాన్‌కు ఆగమేఘాల మీద లాండ్ ఇచ్చారని గుర్తు చేశారు.కాంగ్రెస్ పార్టీని కబ్రస్థాన్ లో పెట్టేందుకు ప్రజలు ఎదురు చూస్తున్నారన్నారు.. కంటోన్మెంట్ అభివృద్ధికి రూ.4 వేల కోట్లు ఇచ్చారని ముఖ్యమంత్రి చెబుతున్నారని చెప్పారు.. అవి ఏమయ్యాయని ప్రశ్నించారు. ఎంఐఎం ఎవరి కోసం ప్రచారం చేస్తుంది.. జూబ్లీహిల్స్ ప్రజలు గమనించాలని విజ్ఞప్తి చేశారు.

RREAD MORE: Srikakulam: తొక్కిసలాట ఆలయం కథ..! తిరుమల శ్రీవారి దర్శనం కాలేదని ఏకంగా గుడి నిర్మించిన భక్తుడు..

Exit mobile version