Site icon NTV Telugu

Raghu Veera Reddy Dance : మనుమరాలితో కలిసి డ్యాన్స్ ఇరగదీసిన రఘువీరా రెడ్డి

Raghuveera Reddy

Raghuveera Reddy

Raghu Veera Reddy Dance : రఘువీరారెడ్డి ఒకప్పుడు ఫేమస్ లీడర్.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేబినెట్ మంత్రిగా పనిచేశారు. రాష్ట్ర విభజన తర్వాత కొంత కాలం పీసీసీ అధ్యక్షుడిగా కొనసాగారు. ఆ తర్వాత నెలకొన్న పరిణామాలతో రాజకీయాలకు స్వస్తిచెప్పి జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఎక్కువగా కుటుంబంతో గడుపుతున్నారు. ఎలాంటి హంగూ ఆర్భాటాలు లేకుండా సాదాసీదా వ్యక్తిగా జీవిస్తున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి రఘువీరారెడ్డి తన మనవరాలితో కలిసి స్టెప్పులేసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

Read Also: Prabhas Disappointing Fans : డార్లింగ్ ఫ్యాన్స్‎కు మరో బ్యాడ్ న్యూస్

టీవీలో వస్తున్న ఓ పాటకు ఆయన డ్యాన్స్ చేశారు. ఇది చూసిన నెటిజన్లు ఆయనపై కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. లీడర్ అంటే మీలా ఉండాలి అని కామెంట్స్ పెడుతున్నారు. ఎలాంటి ఆర్భాటాలు లేకుండా జీవించడంలో మీకు మీరే సాటి అని ప్రశంసిస్తున్నారు. ఈ వయసులోనూ ఇంత చలాకీగా ఉండడం ఆయనకే చెల్లిందంటున్నారు. కాగా, క్రియాశీల రాజకీయాలకు రఘువీరా దూరమైన తర్వాత సోషల్ మీడియాలో తరచూ కనిపిస్తున్నారు. కొన్ని రోజుల క్రితం పెట్టిన ఓ పోస్టు కూడా వైరల్ అయింది. ఓ బావిని చూపిస్తూ తాను చిన్నప్పుడు ఇదే బావిలో ఈత నేర్చుకున్నానని, ఇప్పుడు ఇదే బావిలో తన మనవరాలికి ఈత నేర్పిస్తున్నట్టు ఆ పోస్టులో పేర్కొన్నారు. సాధారణ ఓటర్‌గా క్యూ లైన్‌లో నిల్చొని ఎన్నికల్లో ఓటేసిన సమయంలో ఆయనకు అందరి నుంచి మంచి మన్ననలు అందాయి. మొత్తానికి రఘువీరారెడ్డి రాజకీయాలకు దూరంగా.. హ్యాపీలైఫ్‌ని గడుపుతున్నారు.

Exit mobile version