Site icon NTV Telugu

Ra Raja: మొహాలు చూపించకుండా ‘రా రాజా’.. మార్చి 7న రిలీజ్

Ra Raja

Ra Raja

మొహాలు చూపించకుండా సినిమాను తీయడం అనేది మామూలు సాహసం కాదు. ఆర్టిస్టుల్ని చూపించకుండా కేవలం కథ, కథనాల మీదే నడిచే సినిమా ఇది. శ్రీమతి పద్మ సమర్పణలో శ్రీ పద్మిణి సినిమాస్ బ్యానర్ మీద బి.శివ ప్రసాద్ తెరకెక్కించిన చిత్రం ‘రా రాజా’. ఇలాంటి అద్భుతమైన ప్రయోగం చేసి మెప్పించేందుకు రెడీ అయింది ‘రా రాజా’ టీం. ఈ చిత్రానికి బూర్లే హరి ప్రసాద్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా, కిట్టు లైన్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రాన్ని మార్చి 7న భారీ ఎత్తున రిలీజ్ చేయబోతోన్నారు. ఈ క్రమంలో చిత్రయూనిట్ మీడియా ముందుకు వచ్చింది.

ఈ కార్యక్రమంలో దర్శకుడు బి. శివ ప్రసాద్ మాట్లాడుతూ .. ‘నిర్మాతగా సినిమాలు చేస్తున్న టైంలో నా మైండ్‌లోకి వచ్చిన పాయింట్‌ను కథగా మార్చాను. అలా అనుకోకుండానే నేను దర్శకుడిగా మారిపోయాను. ఈ సినిమా చాలా బాగా వచ్చింది. ఇప్పటి వరకు చూసిన వారంతా మెచ్చుకున్నారు. ఈ చిత్రం మార్చి 7న రాబోతోంది.అందరూ చూసి ఆదరించాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

Exit mobile version