Narayana Murthy : సామాజిక అంశాలను కథలుగా ఎంచుకుని సినిమాలు తీస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు ఆర్. నారాయణ మూర్తి. సాధారణ జీవితం గడుపుతూ ప్రేక్షకుల చేత పీపుల్స్ స్టార్ అనిపించుకున్నారు. ఆయన తెరకెక్కించే ప్రతీ సినిమా కూడా ప్రేక్షకులకు అతి చేరువలో ఉంటుందని చెప్పడంతో సందేహం లేదు. నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా ఆయన అభిమానుల గుండెల్లో నిలిచిపోయారు. ఒకప్పుడు ఇండస్ట్రీ హిట్లు అందించారు ఆర్. నారాయణమూర్తి. ఎంతగా సినిమాలు తీసినా ఆస్తిపరంగా ఆయనేమీ కూడబెట్టుకోలేదు. ప్రస్తుతం చాలా సాధారణ జీవితం గడుపుతున్నారు. ఎంతలా అంటే ఇప్పుడు ఆయన ఉంటున్న ఇళ్లు కూడా అద్దెకు తీసుకున్నదే.
Read Also: Nithya Menon : దర్శకనిర్మాతలను ఇబ్బంది పెడుతున్న నిత్యామీనన్
ఎంతోమంది ఈయనకు సహాయం చేయాలని చూసినప్పటికీ.. ఎవరి సహాయం తీసుకోవడం లేదు. ఎప్పుడూ సమాజంలోని ప్రజల సమస్యలపై పోరాడుతూనే ఉంటారు ఆర్.నారాయణమూర్తి. తాజాగా ఈయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. అసలు విషయం ఏమటంటే..‘‘కళా రంగంలో శ్రీ వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి జీవిత సాఫల్య పురస్కారం కే. విశ్వనాథ గారితో పాటు నాకు కూడా దక్కడం సంతోషంగా ఉంది. ఇందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి , ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ” అని ప్రముఖ దర్శక నిర్మాత , నటుడు ఆర్ నారాయణ మూర్తి తెలిపారు. “రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉత్పన్నమవుతున్న సమస్యలపై “అర్ధరాత్రి స్వతంత్రం” నుంచి సినిమాలు తీస్తున్న నన్ను పీపుల్స్ స్టార్ అని ప్రజలు అభిమానిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది అంటూ ఆర్ నారాయణ మూర్తి తెలిపారు.