Site icon NTV Telugu

Crime: ఫ్యామిలీ వాట్సప్ గ్రూప్ లో గొడవ.. కత్తితో దాడి ఒకరి మృతి

Knife Attack

Knife Attack

సోషల్ మీడియా వల్ల ఇప్పటికే మానవ సంబంధాలు దూరమవుతున్నాయి. ఉన్న కాస్త బంధాన్ని నిలుపుకునేందుకు చాలా మంది వాట్సప్ లో కుటుంబానికి సంబంధించిన గ్రూప్లు క్రియేట్ చేస్తున్నారు. అయితే.. కొన్నిసార్లు గ్రూప్‌లోని ఇతర సభ్యులకు నచ్చని వ్యాఖ్యలు దర్శనమిస్తుంటాయి. గొడవలు చెలరేగుతుంటాయి. రాజస్థాన్‌లోని జైపూర్‌లో ఇలాగే జరిగింది. కాని గొడవ కాస్త ప్రాణాలు తీసుకునేంత వరకు వెళ్లింది. అసలేం జరిగిందంటే..

READ MORE: AP Elections 2024: మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పోలింగ్‌కు ప్రత్యేక ఏర్పాట్లు

జైసింగ్‌పురా ఖోర్ పోలీస్ స్టేషన్ సబ్ ఇన్‌స్పెక్టర్ సతీష్ శర్మ వివరణ ప్రకారం.. సల్మాన్ అన్సారీ కుటుంబ సభ్యులు ‘ఖాన్ ఫ్యామిలీ’ పేరుతో వాట్సాప్ గ్రూప్‌ని క్రియేట్ చేశారు. అయితే గత కొన్ని రోజులుగా సల్మాన్ బంధువులు అస్లాం, జమీర్, సాహిల్ సల్మాన్‌కు వ్యతిరేకంగా మెసేజ్‌లు పోస్ట్ చేస్తున్నారు. ఈ విషయంపై దాయాదుల మధ్య గొడవ జరిగింది. శుక్రవారం అర్థరాత్రి, సల్మాన్ తన బంధువులను శాంతింపజేయడానికి తన షారుఖ్‌తో సహా అతని స్నేహితులతో వెళ్ళాడు. అయితే అక్కడ వాట్సాప్ గ్రూప్‌లో ఒక సందేశంపై వాగ్వాదం చాలా ఎక్కువైంది. దీంతో కజిన్ అస్లాం కత్తి తీసి సల్మాన్ ఛాతీపై నేరుగా పొడిచాడు. సల్మాన్ కాపాడేందుకు ప్రయత్నించిన అతడి స్నేహితుడు షారుక్ ని కూడా కడుపులో పొడిచారు. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు అస్లాం. ఈ ఘటన జైపూర్‌లోని ఓ బార్బర్ షాపులో ఈ ఘటన చోటుచేసుకుంది. దాడిలో సల్మాన్ మరణించగా.. తీవ్రంగా గాయపడిన అతని స్నేహితుడు షారుక్ చికిత్స పొందుతున్నాడు. ప్రస్తుతం మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Exit mobile version