Site icon NTV Telugu

PV Sindhu: కొనసాగుతున్న పీవీ సింధు వైఫల్యం.. ఈ ఏడాదిలో అయిదో సారి!

Japan Open 2025 Pv Sindhu

Japan Open 2025 Pv Sindhu

PV Sindhu Performance in 2025: ఈ సీజన్‌లో రెండుసార్లు ఒలింపిక్ పతక విజేత, భారత స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు వైఫల్యం కొనసాగుతోంది. ఈ ఏడాదిలో సింధు తొలి రౌండ్లోనే ఐదవసారి ఓడిపోయింది. తాజాగా జపాన్ ఓపెన్ 2025 సూపర్ 750 టోర్నమెంట్‌లో తొలి రౌండ్‌లోనే నిష్క్రమించింది. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్‌ పోరులో దక్షిణ కొరియాకు చెందిన సిమ్ యు జిన్ చేతిలో వరుస గేమ్‌ ( 15-21, 14-21)లలో సింధు పరాజయం పాలైంది. సింధుపై సిమ్ యు జిన్ తన కెరీర్‌లో తొలి విజయాన్ని నమోదు చేసింది.

Also Read: Today Astrology: గురువారం దినఫలాలు.. ఆ రాశి వారు వ్యాపారంలో జాగ్రత్త!

లక్ష్యసేన్ ప్రిక్వార్టర్‌ ఫైనల్లో అడుగుపెట్టాడు. పురుషుల సింగిల్స్‌ తొలి రౌండ్లో లక్ష్యసేన్‌ 21-11, 21-18తో చైనా ఆటగాడు వాంగ్‌ జెంగ్‌ షింగ్‌పై విజయం సాధించాడు. మహిళల సింగిల్స్‌లో అనుపమ 21-15, 18-21, 21-18తో రష్మికశ్రీపై గెలుపొంది ప్రిక్వార్టర్‌ ఫైనల్ చేరింది. మరోవైపు డబుల్స్‌లో సాత్విక్‌ సాయిరాజ్‌-చిరాగ్‌ శెట్టి సైతం ప్రిక్వార్టర్‌ ఫైనల్లో అడుగుపెట్టారు. పురుషుల డబుల్స్‌ తొలి రౌండ్లో 21-18, 21-10తో కాంగ్‌ మిన్‌ హ్యుక్‌- డాంగ్‌ జు (కొరియా) జంటను ఓడించారు. పురుషుల డబుల్స్‌లో హరిహరన్‌- రుబన్‌ కుమార్‌, మహిళల డబుల్స్‌లో కవిప్రియ సెల్వం- సిమ్రన్‌ సింఘిలు ఓడిపోయారు.

Exit mobile version